- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మరో వ్యక్తిని ప్రేమించాను.. తాళి కట్టే వేళ వధువు ట్విస్ట్
by Prasad Jukanti |
తాళి కట్టే సమయంలో మరో వ్యక్తిని ప్రేమిస్తున్నానన్న వధువు పెళ్లి మండపంలోనే బిగ్ ట్విస్ట్ ఇచ్చింది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: తాళి కట్టే సమయంలో వధువు ఇచ్చిన ట్విస్ట్ కు పెళ్లి మండపంలో అంతా షాక్ తిన్నారు. తాను మరో వ్యక్తిని ప్రేమిస్తున్నానని మీతో పెళ్లి ఇష్టం లేదని చెప్పడంతో మండపంలో ఉన్నవారంతా ఖంగుతిన్నారు. కర్ణాటకలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా వరుడు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఆసక్తిగా మారింది. హసన్ జిల్లాలో పల్లవి, వేణుగోపాల్ అనే యువతీ, యువకుడికి పెద్దలు పెళ్లి నిర్ణయించారు. పెళ్లి తంతు అంతా అంగరంగ వైభవంగా సాగుతోంది. ఇంతలో పంతులు వరుడి చేత వధువు మెడలో మాంగల్య ధారణ జరిగిస్తుండగా ఒక్కసారిగా వధువు అడ్డు చెప్పింది.
ఒప్పించాలని చూసినా..
తాను మరో వ్యక్తిని ప్రేమిస్తున్నానని ఈ విషయాన్ని తన కుటుంబసభ్యులకు చెప్పలేకపోయానని రోదించింది. ఈ క్రమంలో ఇంత దూరం వచ్చాక ఇప్పుడు పెళ్లి వద్దంటే ఎలా అని తల్లిదండ్రులు, బంధువులు ఒప్పించాలని చూసినా పల్లవి తన మనసు మార్చుకోలేదు. దీంతో వరుడు సైతం తనతో పెళ్లి ఇష్టం ఉందా లేదా అని అడగడంతో తనకు ఇష్టం లేదని చెప్పడంతో ఆమె అభిప్రాయాన్ని గౌరవిస్తూ వరుడు ఈ పెళ్లిని రద్దు చేసుకున్నాడు. దీంతో వరుడు తీసుకున్న నిర్ణయం పట్ల నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ విషయంలో వేణుగోపాల్ చూపిన పరిణితికి హ్యాట్సాప్, బలవంతపు పెళ్లి కాకుండా వాస్తవాన్ని అంగీకరించి వెనక్కి తగ్గినందుకు అతనికి పెద్ద సెల్యూట్ అని కొంత మంది నెటిజన్లు కామెంట్స్ చేస్తుండగా, బతికిపోయావ్ బ్రో అంటూ బ్లూ డ్రమ్ సీన్లను గుర్తు చేస్తూ మరికొందరు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.
Next Story






