ఆటో డ్రైవర్‌ను కలిసిన బాలీవుడ్ నటుడు.. కారణం ఇదే!(ఫొటోస్ వైరల్)

by Jakkula.Mamatha |

బాలీవుడ్ నటుడు(Bollywood actor) సైఫ్‌ అలీఖాన్‌(Saif Ali Khan)పై ఓ దుండగుడు కత్తితో దాడి చేసిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.

ఆటో డ్రైవర్‌ను కలిసిన బాలీవుడ్ నటుడు.. కారణం ఇదే!(ఫొటోస్ వైరల్)
X

దిశ,వెబ్‌డెస్క్: బాలీవుడ్ నటుడు(Bollywood actor) సైఫ్‌ అలీఖాన్‌(Saif Ali Khan)పై ఓ దుండగుడు కత్తితో దాడి చేసిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. అత్యంత కట్టుదిట్టమైన భద్రత(Security) ఉండే ఖరీదైన ప్రాంతంలో నివాసం ఉంటున్న సైఫ్‌పై దాడి జరగడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. సైఫ్‌పై దాడికి దిగిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రస్తుతం ఆయనను విచారిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. సైఫ్‌ను ఆసుపత్రికి ఆటోలో తీసుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆటో డ్రైవర్‌ భజన్ సింగ్ రానాను బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ నేడు(బుధవారం) కలిశారు. తనను సకాలంలో ఆస్పత్రికి తీసుకెళ్లి రక్షించినందుకు ఆయనకు(ఆటో డ్రైవర్) సైఫ్ కృతజ్ఞతలు తెలిపారు. ఇలాగే ఇతరులకు కూడా సహాయం అందించాలని ఆటో డ్రైవర్‌కు సూచించారు. సైఫ్ వెంట ఆయన తల్లి షర్మిలా ఠాగూర్(Sharmila Tagore) కూడా ఉన్నారు. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియా(Social Media)లో వైరల్‌గా మారాయి. కాగా భజన్ సింగ్‌కు సైఫ్ రివార్డు ప్రకటిస్తారని వార్తలు వస్తున్నాయి.

Next Story