ఆ నియామకాలన్నీ చెల్లుతాయి : హైకోర్ట్

by Muthe.Rajitha |

పశ్చిమ బెంగాల్‌లో 32 వేల మంది ప్రైమరీ టీచర్ల ఉద్యోగాలపై నెలకొన్న సందిగ్దత ఎట్టకేలకు వీడింది. రెండేళ్లుగా కొనసాగుతున్న ఉత్కంఠతకు నేడు కలకత్తా హైకోర్టు డివిజన్ బెంచ్ చెక్ పెట్టింది.

ఆ నియామకాలన్నీ చెల్లుతాయి : హైకోర్ట్
X

దిశ, వెబ్ డెస్క్ : పశ్చిమ బెంగాల్‌లో 32 వేల మంది ప్రైమరీ టీచర్ల ఉద్యోగాలపై నెలకొన్న సందిగ్దత ఎట్టకేలకు వీడింది. రెండేళ్లుగా కొనసాగుతున్న ఉత్కంఠతకు నేడు కలకత్తా హైకోర్టు డివిజన్ బెంచ్ చెక్ పెట్టింది. 2023 మే 12న జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ్ ఇచ్చిన సింగిల్ బెంచ్ తీర్పును పూర్తిగా పక్కనపెట్టి.. 2014 TET ద్వారా నియమితులైన 32,000 మంది ప్రైమరీ టీచర్ల ఉద్యోగాలను పునరుద్ధరిస్తున్నట్టు జస్టిస్ తపబ్రత చక్రవర్తీ, జస్టిస్ రీతబ్రత కుమార్ మిత్రలతో కూడిన డివిజన్ బెంచ్ కీలక తీర్పు ఇచ్చింది. సీబీఐ దర్యాప్తులో కేవలం 264 మంది నియామకాల్లో మాత్రమే అక్రమాలు గుర్తించగా.. మరో 96 మంది విచారణలో ఉన్నారని... మొత్తం 42,500 మందిలో ఎక్కువ మంది నిర్దోషులే అని బెంచ్ నిర్ధారించింది.

9 సంవత్సరాలుగా పనిచేస్తున్న టీచర్లను ఒకేసారి రోడ్డున పడేయడం అన్యాయం అని, అధికారుల తప్పిదాలకు సామాన్య ఉద్యోగులను బలి చేయకూడదని తీర్పులో పేర్కొన్నారు. ఈ తీర్పుతో లక్షలాది మంది టీచర్ల కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. అలాగే ముఖ్యమంత్రి మమతా బెనర్జీ "మా సోదరీసోదరుల ఇళ్లలో దీపాలు వెలిగాయి" అంటూ సంతోషం వ్యక్తం చేయగా.. విద్యాశాఖ మంత్రి బ్రత్య బసు "సత్యం గెలిచింది" అని పేర్కొన్నారు. కాగా 2026 అసెంబ్లీ ఎన్నికలకు ముందు తృణమూల్ కాంగ్రెస్‌కు ఈ తీర్పు భారీ ఊరట కలిగించింది.

Next Story