- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టడం వల్లే ప్రమాదం..
కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా హిరియూరు సమీపంలో జాతీయ రహదారి ఎన్‌హెచ్–48పై గురువారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 20 మంది సజీవ దహనమయ్యారు.

దిశ, వెబ్ డెస్క్ : కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా హిరియూరు సమీపంలో జాతీయ రహదారి ఎన్‌హెచ్–48పై గురువారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 20 మంది సజీవ దహనమయ్యారు. హిరియూర్ నుంచి బెంగళూరు వెళ్తున్న కంటైనర్ లారీ చిత్రదుర్గ జిల్లా గోర్లతు వద్ద అదుపుతప్పి రోడ్డుకు అటుపక్కగా బెంగళూరు నుంచి శివమొగ్గ వెళ్తున్న ట్రావెల్స్ బస్సును ఢీ కొట్టింది. అయితే లారీ సరాసరి బస్సు డీజిల్ ట్యాంకర్ ను బలంగా గుద్దుకోవడం వల్లే అది పేలిపోయి మంటలు క్షణాల్లో బస్సు మొత్తం వ్యాపించాయని పోలీసులు అభిప్రాయపడుతున్నారు.ప్రమాద సమయంలో బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు ఉండగా, ఇప్పటివరకు 20 మంది మంది మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి.
మరికొందరు తీవ్ర గాయాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రమాదంలో బస్సుతోపాటు లారీ కూడా పూర్తిగా కాలిపోయింది. అయితే బస్సు డ్రైవర్, కండక్టర్ మాత్రం అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డారు. స్థానికులు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేసారు. హిరియూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. లారీ డ్రైవర్ అతి వేగం, నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్దారించారు.






