నేను చేసిన అతిపెద్ద తప్పు అదే.. ఎప్‌స్టీన్‌తో సంబంధాలపై బిల్‌గేట్స్

by Kema Shiva Kumar |

ఎప్‌స్టీన్‌ ఫైల్స్ వ్యవహారం ప్రపంచ దేశాలను ఆశ్చర్యపోయేలా చేస్తోంది.

నేను చేసిన అతిపెద్ద తప్పు అదే.. ఎప్‌స్టీన్‌తో సంబంధాలపై బిల్‌గేట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ఎప్‌స్టీన్‌ ఫైల్స్ వ్యవహారం ప్రపంచ దేశాలను ఆశ్చర్యపోయేలా చేస్తోంది. అయితే, జెఫ్రీ ఎడ్వర్డ్ ఎప్‌స్టీన్‌ (Jeffrey Edward Epstein)తో సంబంధాలపై తాజాగా ప్రపంచ అపర కుబేరులలో ఒకరైన బిల్ గేట్స్ (Bill Gates) మొదటిసారి స్పందించారు. ఓ ఇంటర్నేషనల్ మీడియా సంస్థ ప్రచురించిన కథనం ప్రకారం.. ఎప్‌స్టీన్‌తో తనకు ఉన్న సంబంధాలపై వస్తున్న సరికొత్త ఆరోపణలను బిల్ గేట్స్ తీవ్రంగా ఖండించారు. అమెరికా న్యాయ శాఖ (DOJ) విడుదల చేసిన తాజా పత్రాల నేపథ్యంలో తనపై వస్తున్నవన్నీ తప్పుడు ఆరోపణలు అని ఆయన స్పష్టం చేశారు.

ఎప్‌స్టీన్‌తో తాను జరిపిన సమావేశాలు కేవలం సేవా కార్యక్రమాల (Philanthropy) కోసమేనని చెప్పుకొచ్చారు. ప్రపంచ ఆరోగ్య సమస్యల పరిష్కారం కోసం ఎప్‌స్టీన్ బిలియన్ల కొద్దీ నిధులు సమకూరుస్తానని చెప్పాడని, ఆ ఉద్దేశంతోనే అతడిని కలిశానని గేట్స్ పేర్కొన్నారు. అయితే, తన జీవితంలో అతడిని కలవడం పెద్ద తప్పు అని ఆయన అంగీకరించారు. తన మాజీ భార్య మెలిండా కూడా తమ వివాహ బంధం విడిపోవడానికి ఎప్‌స్టీన్‌తో పరిచయమే కారణమని చెప్పిందని అన్నారు. అయితే, ఎప్‌స్టీన్‌తో సంబంధాన్ని బిల్ గేట్స్ కేవలం వృత్తిపరమైన పొరపాటుగా అభివర్ణిస్తుండగా.. ప్రజల్లో, మీడియాలో మాత్రం ఇది హాట్ టాపిక్‌గా మారింది.

Next Story