- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
‘ఆ ఫీలింగ్ చాలా అద్భుతంగా ఉంది’.. కుంభమేళలో పాక్ హిందువులు ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

దిశ,వెబ్‌డెస్క్: ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకైన మహాకుంభమేళా(Mahakumbh Mela) అత్యంత వైభవోపేతంగా జరుగుతోంది. ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లోని ప్రయోగరాజ్(Prayag Raj)లో జరుగుతున్న మహాకుంభమేళాకు దేశ విదేశాల నుంచి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ఈ క్రమంలో ప్రయోగరాజ్‌కు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ తరుణంలో త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. ఇందులో సామాన్యులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు సైతం పాల్గొంటున్నారు. పవిత్ర కుంభమేళాకు వెళ్లి స్నానం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే ఆధ్యాత్మిక వేడుకైన మహాకుంభమేళా లో పాల్గొనేందుకు పాకిస్థాన్(Pakisthan) నుంచి 68మంది హిందువులు ప్రయాగరాజ్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలో త్రివేణి సంగమంలో స్నానం ఆచరిస్తున్నారు. అనంతరం అక్కడ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమది సింధ్ ప్రావిన్స్ అని, 144 ఏళ్లకు ఓసారి వచ్చే ఈ మహత్తర సందర్భాన్ని మిస్ చేసుకోలేక భారత్‌కు(India) వచ్చామని వారు వివరించారు. ఈ క్రమంలో హరిద్వార్‌కు వెళ్లి మా అందరి పూర్వీకుల అస్థికల్ని గంగలో కలిపామని తెలిపారు. మా మతం గొప్పతనాన్ని తొలిసారిగా మరింత లోతుగా అర్థం చేరుకోగలుగుతున్నాం అన్నారు. ఈ ఫీలింగ్ చాలా అద్భుతంగా ఉంది అని పేర్కొన్నారు.