- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Joe Biden : మీ ప్రేమకు ధన్యవాదాలు : జో బైడెన్
అమెరికా(USA) మాజీ అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden)కు ప్రోస్టేట్ క్యాన్సర్(Prostate Cancer) ఉన్నట్లు నిర్ధారణ జరిగిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : అమెరికా(USA) మాజీ అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden)కు ప్రోస్టేట్ క్యాన్సర్(Prostate Cancer) ఉన్నట్లు నిర్ధారణ జరిగిన విషయం తెలిసిందే. ఇది ఇప్పటికే ఎముకలకు వ్యాపించిందని వైద్యులు ధృవీకరించినప్పటికీ.. చికిత్స సాధ్యమేనని, తిరిగి ఆయన ప్రజల్లోకి వస్తారని ఆయన కార్యాలయం నేడు ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ వార్త తెలిసిన వెంటనే డొనాల్డ్ ట్రంప్, బరాక్ ఒబామా, కమలా హ్యారిస్, హిల్లరీ క్లింటన్ వంటి నాయకులు, ఆయన పార్టీ లీడర్స్, సామాన్య ప్రజలు సోషల్ మీడియాలో బైడెన్ త్వరగా కోలుకోవాలని భారీగా పోస్ట్‌లు పెట్టారు. దీనిపై స్పందిస్తూ బైడెన్ సోమవారం ఆయన భార్య జిల్ బైడెన్, తమ పెంపుడు పిల్లితో సెల్ఫీ పోస్ట్ చేస్తూ.. " క్యాన్సర్ మన అందరినీ తాకుతుంది. మీలో చాలా మందిలాగే నేను, జిల్ ధైర్యంగా ఉన్నాం. మీరు నాపై చూపించిన ప్రేమకు, మద్దతుకు ధన్యవాదాలు"అని రాశారు.






