'Thandel' Scene Repeat: తమిళనాడులో 'తండేల్' సినిమా సీన్ రిపీట్!

by Y. Venkata Narasimha Reddy |   (  Updated:2025-02-27 10:49:17  IST  )

హీరో నాగ చైతన్య(Naga Chaitanya) నటించిన 'తండేల్' సినిమా('Thandel' Movie) సీన్ తమిళనాడు(Tamil Nadu)లో రిపీటైంది(Repeated)

Thandel Scene Repeat: తమిళనాడులో తండేల్ సినిమా సీన్ రిపీట్!
X

దిశ, వెబ్ డెస్క్ : హీరో నాగ చైతన్య(Naga Chaitanya) నటించిన 'తండేల్' సినిమా('Thandel' Movie) సీన్ తమిళనాడు(Tamil Nadu)లో రిపీటైంది(Repeated). పొరపాటున అంతర్జాతీయ సముద్ర జలాల్లోకి ప్రవేశించిన మత్స్యకారులను పాకిస్తాన్ నేవీ అదుపులోకి తీసుకుని నిర్భంధించడం..వారి విడుదలకు హీరోయిన్ సాయి పల్లవి సహా బాధిత కుటుంబాలు సాగించిన పోరాటమే తండేల్ సినిమా కథ. కథనంలో మత్స్యకారుల(Fishermen)నాయకుడి(తండేల్)గా పాక్ లో వారి క్షేమం కోసం నాగ చైతన్య చేసిన పోరాటాలు ఆకట్టుకుంటాయి.

నిజజీవితంలో శ్రీకాకుళం మత్స్యకారులకు ఎదురైన ఘటనే తండేల్ సినిమా కథ కూడా. ఇప్పుడు తండేల్ సినిమాలో మాదిరిగానే తమిళనాడు(Tamil Nadu)లోని రామేశ్వరం, తంగచిమడం ప్రాంతాలకు చెందిన 27 మంది మత్స్య కారులు అంతర్జాతీయ జలాల సరిహద్దు రేఖ దాటారని శ్రీలంక నావికాదళం అరెస్ట్ చేసింది. దీంతో రామేశ్వరం ఫిషింగ్ హార్బర్ లో 700 మంది మత్స్య కారులు తమ కార్యకలాపాలను నిలిపి నిరవధిక సమ్మె చేపట్టారు. ఈ విషయాన్ని తమిళనాడు ప్రభుత్వం కేంద్రానికి చేరవేయడంతో సంప్రదింపుల తర్వాత 27 మందిని విడుదల చేశారు.

ఇటీవల పాకిస్థాన్‌ జైలు నుంచి కూడా 22 మంది మత్స్యకారులు విడుదలయ్యారు. వారి శిక్షాకాలం పూర్తి కావడంతో కరాచీలోని మాలిర్ కారాగారం నుంచి గత శుక్రవారం విడుదలయ్యారు. వాఘా సరిహద్దు ద్వారా వారిని పాక్‌ అధికారులు భారత్‌కు అప్పగించారు. ఇది కూడా తండేల్ సినిమా కథకు అద్ధం పట్టింది. మత్స్యకారులు సరిహద్దులను సరిగా గుర్తించకపోవడం..ప్రమాదాలు, పొరపాట్ల సందర్భంగా ఇతర దేశాల సముద్ర జలాల పరిధిలోకి వెళ్లిన సందర్భంలో అరెస్టులు జరుగుతున్నాయి.

పాకిస్థాన్‌లో 266 మంది భారత ఖైదీలు ఉన్నారు. భారత జైళ్లలో మొత్తం 462 మంది పాకిస్థానీయులు ఉన్నట్లు మన దేశ జాబితా పేర్కొంది. జనవరి 1న ఇరుదేశాల ఖైదీల జాబితా మార్పిడి జరగడంతో వారి విడుదల ప్రక్రియ సాగుతోంది. అటు శ్రీలంక ప్రభుత్వం కూడా 27మందిని విడుదల చేసింది.

Next Story