- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Official: తమిళనాడు సీఎంగా విజయ్.. రేపే ప్రమాణ స్వీకారం
తమిళనాడు రాజకీయాల్లో గతకొద్ది రోజులుగా కొనసాగుతున్న సస్పెన్స్‌కు తెరపడింది. తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు రాజకీయాల్లో గతకొద్ది రోజులుగా కొనసాగుతున్న సస్పెన్స్‌కు తెరపడింది. తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మెజారిటీకి కావాల్సిన ఎమ్మెల్యేల మద్దతు లేఖలను పరిశీలించిన అనంతరం, ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్‌ను గవర్నర్ ఆహ్వానించారు. విజయ్ ముఖ్యమంత్రిగా రేపు (ఆదివారం) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చెన్నైలోని జవహర్ లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో మధ్యాహ్నం 3 గంటలకు ఈ వేడుక అత్యంత వైభవంగా జరగనుంది. ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ ప్రముఖులు, సినీ రంగ ప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉంది.
120కి చేరిన విజయ్ బలం..
తమిళనాడులో సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలతో పాటు విదుతలై చిరుతైగల్ కచ్చి (VCK), ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) పార్టీలు విజయ్‌కు తమ మద్దతును ప్రకటించాయి. దీంతో విజయ్ నేతృత్వంలోని కూటమి బలం 120కి చేరుకుంది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మేజిక్ ఫిగర్ (118) కంటే ఇది ఎక్కువ కావడంతో విజయ్ పీఠం ఖాయమైంది. గవర్నర్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో తమిళనాడు వ్యాప్తంగా టీవీకే శ్రేణులు, విజయ్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. చెన్నై వీధుల్లో బాణాసంచా పేలుస్తూ, మిఠాయిలు పంచుతూ సంబరాల్లో మునిగిపోయారు. ముఖ్యంగా విజయ్ రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించిన నాటి నుంచి ఎదురుచూస్తున్న అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తమిళనాడులో దశాబ్దాల పాటు సాగిన ద్రావిడ దిగ్గజాల పాలన తర్వాత, ఒక సినీ నటుడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తుండటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.






