- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తమిళనాడు సీఎంగా తలపతి విజయ్..? TVK శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవ ఎన్నిక
తమిళనాడులో టీవీకే అఖండ విజయం తర్వాత తలపతి విజయ్ ఆ పార్టీ శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడులో టీవీకే (TVK) తిరుగులేని విజయం సాధించిన నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. తాజాగా, చెన్నైలోని పనైయూర్ (Panaiyur) పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకుల భేటీ ముగిసింది. ఈ సమావేశంలో భాగంగా విజయ్‌ని శాసనసభా పక్ష నేతగా ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో ఇతర పార్టీ సభ్యుల మద్దతుతో మ్యాజిక్ ఫిగర్ చేరుకుంటే విజయ్ ముఖ్యమంత్రి పీఠం ఎక్కేందుకు లైన్ క్లియర్ కానుంది.
తిరుచ్చి ఈస్ట్ స్థానానికి రాజీనామా?
అయితే, రెండు నియోజవర్గాల నుంచి టీవీకే అధినేత తలపతి విజయ్ పోటీ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన పెరంబూరులో సమీప డీఎంకే ప్రత్యర్థి ఆర్‌డీ శేఖర్ (R.D. Shekhar)పై 53,715 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అదేవిధంగా తిరుచ్చి ఈస్ట్ (Tiruchi East) నియోజకవర్గంలో సమీప ప్రత్యర్థి డీఎంకే అభ్యర్థి ఎస్.ఇరుదయరాజ్‌పై 27,416 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. కానీ, రెండు నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న విజయ్ ప్రస్తుతం ఒక స్థానాన్ని వదులుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో ఆయన పెరంబూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగానే కొనసాగాలని నిర్ణయించుకున్నట్లుగా సమాచారం.
పెరంబూరు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ, అక్కడి సమస్యల పరిష్కారానికే ఆయన మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.






