- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Gautam Gambhir : గంభీర్‌కు ఉగ్రవాదుల బెదిరింపులు.. అప్రమత్తమైన పోలీసులు
భారత మాజీ క్రికెటర్, మాజీ ఎంపీ, ప్రస్తుత భారత క్రికెట్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ను హతమారుస్తామని ఇస్లామిక్ స్టేట్ (ISIS)తో సంబంధం ఉన్న వ్యక్తి బెదిరింపులకు పాల్పడ్డాడు.

దిశ, వెబ్ డెస్క్: భారత మాజీ క్రికెటర్, మాజీ ఎంపీ, ప్రస్తుత భారత క్రికెట్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) ను హతమారుస్తామని ఇస్లామిక్ స్టేట్ (ISIS)తో సంబంధం ఉన్న వ్యక్తి బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో అప్రమత్తమైన గంభీర్ వెంటనే ఢిల్లీ పోలీసులను ఆశ్రయించారు. తనకు ఈ ఇమెయిల్‌లో తనని తన కుటుంబాన్ని హత్య చేస్తామని, ఆయన నివాసం వద్ద బాంబు దాడులు చేస్తామని బెదిరించినట్లు తెలిపారు. ఈ బెదిరింపు సందేశాలు గత కొన్ని రోజులుగా ఇమెయిల్‌ల రూపంలో వచ్చినట్లు గంభీర్ పోలీసులకు తెలిపారు. దీంతో అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి, విచారణ ప్రారంభించారు. అలాగే గంభీర్ నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆయన కుటుంబానికి కూడా అదనపు రక్షణ కల్పించారు. సైబర్ క్రైమ్ విభాగం ఈ ఇమెయిల్‌ల మూలాన్ని గుర్తించేందుకు ట్రాకింగ్ పనులు చేపట్టింది. ప్రాథమిక దర్యాప్తులో ఈ ఇమెయిల్‌లు విదేశాల నుంచి, ముఖ్యంగా పాకిస్థాన్ లేదా ఇతర దేశాల నుంచి వచ్చినట్లు అనుమానిస్తున్నారు.
- Tags
- gautam gambhir






