- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Terrorists: ఆల్ ఖైదాతో సంబంధాలు.. గుజరాత్‌లో నలుగురు అరెస్ట్
నకిలీ కరెన్సీ రాకెట్ నడుపుతూ, ఆల్ ఖైదా భావజాలాన్ని వాప్తి చేస్తున్ననలుగురు ఉగ్రవాద అనుమానితులను గుజరాత్ ఏటీఎస్ అరెస్ట్ చేసింది.

దిశ, నేషనల్ బ్యూరో: నకిలీ కరెన్సీ రాకెట్ నడుపుతూ, ఆల్ ఖైదా (Al-Qaeda) భావజాలాన్ని వాప్తి చేస్తున్న నలుగురు ఉగ్రవాద అనుమానితులను గుజరాత్ యాంటి టెర్రిరిస్ట్ స్క్యాడ్ (ATS) బుధవారం అరెస్ట్ చేసింది. గుజరాత్‌లో ఇద్దరిని, మరో ఇద్దరిని ఇతర రాష్ట్రాల్లో అరెస్ట్ చేశారు. వారిని మొహమ్మద్ ఫైక్, మొహమ్మద్ ఫర్దీన్, సెఫుల్లా కురేషి, జీషన్ అలీగా గుర్తించారు. వీరంతా అల్-ఖైదా భావజాలాన్ని వ్యాప్తి చేయడానికి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు, అనుమానాస్పద యాప్‌లను ఉపయోగిస్తున్నారని తెలిపారు. నిందితులకు చాలా కాలంగా ఉగ్ర సంస్థతో సంబంధాలున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారానే ఆల్ ఖైదాతో సంబందాలు పెట్టుకున్నారని పేర్కొన్నారు. భద్రతా సంస్థలు వారి సోషల్ మీడియా ఖాతాలలో దేశ వ్యతిరేక, రెచ్చగొట్టే పోస్టులను గుర్తించిన తర్వాత వారిపై నిఘా ఉంచారు. ఈ క్రమంలోనే తాజాగా అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వారిని విచారిస్తున్నట్టు తెలుస్తోంది.






