భారత్‌లో వందపైగా చొరబాట్లు చేయించిన ‘హ్యూమన్ జీపీఎస్’ హతం

by Phanindra |

భారత్‌లో వందపైగా చొరబాట్లు చేయించిన ‘హ్యూమన్ జీపీఎస్’ హతమయ్యాడు. శనివారం మరో చొరబాటుకు ప్రయత్నిస్తుండగా బాగూ ఖాన్‌ను భద్రతా దళాలు కాల్చి చంపాయి.

భారత్‌లో వందపైగా చొరబాట్లు చేయించిన ‘హ్యూమన్ జీపీఎస్’ హతం
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్‌లోకి అక్రమ చొరబాట్లు చేయించడంలో ఆరితేరి, ‘హ్యూమన్ జీపీఎస్’గా పేరొందిన ఉగ్రవాది బాగూ ఖాన్‌ను భద్రతా దళాలు హతమార్చాయి. ‘సమందర్ చాచా’ అని కూడా పిలిచే బాగూ ఖాన్.. 1995 నుంచి పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉంటున్నట్లు సమాచారం. అక్కడి నుంచి పలువురు బడా టెర్రరిస్టులను కూడా బాగూ ఖాన్ భారత్‌లోకి అక్రమంగా పంపినట్లు తెలుస్తోంది. శనివారం నాడు నౌషేరా ప్రాంతంలో మరోసారి చొరబాటుకు ప్రయత్నిస్తుండగా బాగూ ఖాన్‌తోపాటు మరో వ్యక్తిని భద్రతా దళాలు కాల్చిచంపాయి.

భద్రతా దళాల సమాచారం మేరకు బాగూ ఖాన్ ద్వారా భారత్‌లోకి వంద మందికిపైగా ఉగ్రవాదులు అక్రమంగా ప్రవేశించారు. గురెజ్ ప్రాంతంలో యాక్టివ్‌గా ఉండే ఖాన్‌కు ఇక్కడి రహస్య మార్గాలపై మాగా పట్టున్నట్లు సమాచారం. గతంలో హిజ్‌బుల్ ముజాహిదీన్ కమాండర్‌గా ఉన్నప్పుడు కూడా భారత్‌లోకి ప్రవేశించేందుకు అన్ని రకాల ఉగ్రసంస్థలకు బాగూ ఖాన్ సహకారం అందిచేవాడని భద్రతా దళాలు చెప్తున్నాయి.

Next Story