మరో ఉగ్ర కుట్రకు ఉగ్రవాదుల ప్లాన్ – పాక్‌ ISI మద్దతుతో గ్రెనేడ్ దాడి యత్నం విఫలం

by Malleboina Mahesh |

ఢిల్లీలో ఉగ్రవాద ఆత్మాహుతి దాడి మరువక ముందే.. పంజాబ్‌లో మరో కుట్రకు ISI ప్లాన్ చేసింది. దీనిని పంజాబ్ పోలీసులు పసిగట్టి కుట్రను భగ్నం చేశారు.

మరో ఉగ్ర కుట్రకు ఉగ్రవాదుల ప్లాన్ – పాక్‌ ISI మద్దతుతో గ్రెనేడ్ దాడి యత్నం విఫలం
X

దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీలో ఉగ్రవాద ఆత్మాహుతి దాడి మరువక ముందే.. పంజాబ్‌లో మరో కుట్రకు ISI ప్లాన్ చేసింది. దీనిని పంజాబ్ పోలీసులు పసిగట్టి కుట్రను భగ్నం చేశారు. పక్కా సమాచారంతో చేసిన దాడిలో లూధియానా పోలీసులకు పెద్ద విజయం దక్కింది. పంజాబ్ డీజీపీ (Punjab DGP) వెల్లడించిన వివరాల ప్రకారం.. లూధియానా కమిషనరేట్ పోలీసులు పాక్‌ ISI మద్దతుతో పనిచేసిన గ్రెనేడ్ దాడి (Grenade attack) ముఠా ప్లాన్‌ను భగ్నం చేశారు. ఈ ఆపరేషన్‌లో విదేశీ హ్యాండ్లర్లకు అనుబంధంగా ఉన్న 10 మంది కీలక వ్యక్తులను అరెస్ట్ చేశారు. ప్రాథమిక దర్యాప్తులో నిందితులు మలేషియాలో ఉన్న ముగ్గురు మధ్యవర్తుల ద్వారా పాకిస్థాన్ (Pakistan) హ్యాండ్లర్లతో నేరుగా సంబంధాలు కొనసాగించినట్లు పోలీసులు వెల్లడించారు.

ఈ ముఠాకు రాష్ట్రంలో ఉద్రిక్తతలు సృష్టించేందుకు జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతంలో గ్రెనేడ్ దాడి జరపాలని పాక్‌ ఆధారిత హ్యాండ్లర్లు ఆదేశాలు ఇచ్చినట్లు విచారణలో తేలింది. దాడికి ఉపయోగించాల్సిన హ్యాండ్ గ్రెనేడ్‌ (Hand grenade)ను స్వీకరించడం, సరఫరా చేయడం వంటి సమన్వయం కూడా ఈ నెట్వర్క్ ద్వారా జరిగినట్లు పోలీసులు గుర్తించారు. కాగా ప్రస్తుతం ఈ ఉగ్రదాడి కుట్ర ప్లాప్ పై పంజాబ్ పోలీసులు విస్తృత దర్యాప్తు కొనసాగిస్తుండగా, ఇలాంటి ఉగ్ర కుట్రలను ముందుగానే గుర్తించి అడ్డుకునేందుకు భద్రతా విభాగాలు అప్రమత్తంగా ఉన్నాయని డీజీపీ తెలిపారు.

Next Story