- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Flash News: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల సహాయకులు అరెస్ట్
బుద్గాం జిల్లాలో (Budgam District) ఉగ్రవాదులకు సహాయం చేస్తున్న ఇద్దరు వ్యక్తులను భద్రతా బలగాలు చెక్ పోస్టు వద్ద అరెస్ట్ చేశాయి. వారి నుంచి గ్రనేడ్, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: పహల్గామ్ ఉగ్రదాడి (Pahalgam Terror Attack) తర్వాత ఇండియన్ ఆర్మీ (Indian Army) జమ్మూ కశ్మీర్ (Jammu & Kashmir)లో హై అలర్ట్ ప్రకటించింది. దాడికి పాల్పడిన ఉగ్రవాదులు ఇంకా ఆ చుట్టుపక్కల ఉన్న అడవుల్లోనే ఉన్నారన్న సమాచారంతో వారి కోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టింది. అలాగే అనుమానాస్పద వ్యక్తులను అధికారులు విచారిస్తున్నారు. మరోసారి ఉగ్రదాడులు జరగవచ్చన్న హెచ్చరికల నేపథ్యంలో ఆర్మీ బలగాలు, జమ్మూకశ్మీర్ పోలీసులు అప్రమత్తమయ్యారు.
తాజాగా బుద్గాం జిల్లాలో (Budgam District) ఉగ్రవాదులకు సహాయం చేస్తున్న ఇద్దరు వ్యక్తులను భద్రతా బలగాలు చెక్ పోస్టు వద్ద అరెస్ట్ చేశాయి. వారి నుంచి గ్రనేడ్, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఇరువురిపై కేసు నమోదు చేసి, విచారణ చేస్తున్నారు. పహల్గామ్ ఉగ్రదాడిలో వారికి హస్తం ఉందా? దాడికి పాల్పడిన వారు ఎక్కడున్నారు? ఇంకా ఎక్కడెక్కడ ఉగ్రదాడులు ప్లాన్ చేశారు? వంటి విషయాలపై ఆరా తీస్తున్నారు.
ఇదిలా ఉండగా.. పాక్ ఆర్మీ (Pak Army) పదే పదే నియంత్రణ రేఖ (LOC) వెంబడి కాల్పులకు పాల్పడుతోంది. తాజాగా కుప్వారా, బారాముల్లా, పూంఛ్, రాజౌరీ, మెంధార్, నౌషేరా, సుందర్ బానీ, అఖ్నూర్ వద్ద కాల్పులకు తెగబడగా.. ఇండియన్ ఆర్మీ సమర్థవంతంగా తిప్పికొట్టింది.






