Terror threat: మరోసారి ఉగ్రవాద ముప్పు.. ఇంటలిజెన్స్ వర్గాల వార్నింగ్ !

by B.Srinivas |

జమ్మూ కశ్మీర్‌లోని పహెల్గాం ఉగ్రదాడితో దేశ వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే.

Terror threat: మరోసారి ఉగ్రవాద ముప్పు.. ఇంటలిజెన్స్ వర్గాల వార్నింగ్ !
X

దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూ కశ్మీర్‌ (Jammu Kashmir) లోని పహెల్గాం ఉగ్రదాడితో దేశ వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే దేశంలో మరోసారి ఉగ్రవాద ముప్పు పొంచి ఉందని ఇంటెలిజెన్స్ (Intelligance) వర్గాలు కేంద్ర ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చినట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. దీంతో బంగ్లాదేశ్ (Bangladesh) సరిహద్దుల్లో భారత్ భద్రతను కట్టుదిట్టం చేసింది. సరిహద్దులు, వాయు, జల మార్గాల్లో సెక్యురిటీ పెంచాలని పారామిలటరీ బలగాలను ఆదేశించినట్టు సమాచారం. బంగ్లాదేశ్‌తో లింక్ చేయబడిన ప్రయాణ మార్గాలపై ప్రత్యేక దృష్టి సారించి, సెక్యురిటీ గ్రిడ్‌ను కఠినతరం చేయాలని కేంద్ర, రాష్ట్ర దళాల ఉన్నతాధికారులకు ఆర్డర్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అంతేగాక ఇటీవల ఇదే విషయంపై ఉన్నత స్థాయి భద్రతా సమీక్ష సమావేశం నిర్వహించినట్టు వెల్లడించాయి.

నిషేధిత ఉగ్రవాద సంస్థ జమాత్-ఉల్-ముజాహిదీన్ బంగ్లాదేశ్ (JMB) కార్యకలాపాలపై నిఘా సంస్థలు హెచ్చరించినట్టు తెలుస్తోంది. ఇటీవల ఢాకాలో జరిగిన ఓ ర్యాలీలో ఆ సంస్థ బహిరంగంగా తన జెండాలను ప్రదర్శించి, గాజా వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో హమాస్‌కు మద్దతు ప్రకటించింది. అంతేగాక ఇటీవల వెస్ట్ బెంగాల్ పోలీసులు జరిపిన సోదాల్లోనూ జేఎంబీతో సంబంధం ఉన్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే ఇంలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. దీంతో అప్రమత్తమైన బీఎస్ఎఫ్ చొరబాటుకు గురయ్యే ప్రాంతాలలో గస్తీని ముమ్మరం చేసింది.

Next Story