- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దేశంలో ఉగ్రవాద ముప్పు.. హై అలర్ట్ ప్రకటించిన నిఘా వర్గాలు
మన దేశ సరిహద్దు దాటి ఉగ్రవాదులు భారతదేశంలోకి ప్రవేశించి విద్రోహ చర్యలకు పాల్పడే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు గట్టి హెచ్చరికలు జారీ చేశాయి.

దిశ, వెబ్ డెస్క్: మన దేశ సరిహద్దు దాటి ఉగ్రవాదులు భారతదేశంలోకి ప్రవేశించి విద్రోహ చర్యలకు పాల్పడే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు (Intelligence agencies) గట్టి హెచ్చరికలు జారీ చేశాయి. ముఖ్యంగా పాకిస్థాన్ ఐఎస్ఐ (ISI) మద్దతుతో ఉగ్రవాదులు పంజాబ్ సరిహద్దుల గుండా చొరబడి సైనిక స్థావరాలు, రద్దీగా ఉండే ప్రాంతాలను లక్ష్యంగా చేసుకునే ప్రమాదం ఉందని మిలిటరీ ఇంటెలిజెన్స్ (MI) హెచ్చరించింది. ఈ నేపథ్యంలో పంజాబ్ పోలీసులు, సరిహద్దు భద్రతా దళం (BSF) సమన్వయంతో సరిహద్దు ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.
పఠాన్‌కోట్, గురుదాస్‌పూర్ వంటి సున్నిత ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించి, రహదారులపై ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల ఘనంగా జరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ, ముంబై, కోల్‌కతా వంటి మెట్రో నగరాల్లో కూడా పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. పండగ సీజన్‌లో జనసందోహం ఎక్కువగా ఉండే మాల్స్, చర్చిలు, మార్కెట్లు, రైల్వే స్టేషన్ల వద్ద భద్రతను రెట్టింపు చేశారు.
ఇటీవల ఢిల్లీ, మహారాష్ట్రలో ISIS అనుబంధ మాడ్యూల్స్‌పై జరిగిన దాడుల్లో కొందరు ఉగ్రవాదులు అరెస్టయిన నేపథ్యంలో, స్లీపర్ సెల్స్ కార్యకలాపాలపై నిఘా వర్గాలు డేగ కన్ను వేశాయి. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా అనుమానం వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు కోరారు.






