- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కేసులో కీలక పరిణామం.. డాక్టర్ ఉమర్ ఆఖరి వీడియో విడుదల
ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఉగ్రవాది డాక్టర్ ఉమర్ చాందినీ చౌక్ వద్ద సూసైడ్ బాంబ్ బ్లాస్టింగ్ కు పాల్పడిన విషయం తెలిసిందే. సూసైడ్ బాంబ్ బ్లాస్ట్ కు ముందు అతను ఆత్మాహుతి దాడిపై మాట్లాడిన సెల్ఫ్ రికార్డెడ్ వీడియోను అధికారులు తాజాగా రిలీజ్ చేశారు. ఆత్మాహుతి దాడిపై సమాజంలో భిన్ వాదనలు ఉన్నాయంటూ.. తన వాదనను వినిపించాడు డాక్టర్ ఉమర్.
సూసైడ్ బాంబ్ బ్లాస్ట్ చేసుకోవాలనుకునేవ్యక్తి చాలా భయంకరమైన మైండ్ సెట్ లోకి వెళ్లాల్సి ఉంటుందని, చావే అతని అంతిమ లక్ష్యంగా నిశ్చయింకోవాలని వీడియోలో చెప్పుకొచ్చాడు. నిజానికి ఆత్మాహుతి దాడి చేసుకోవాలన్న ఆలోచనను ఈ సమాజం ఒప్పుకోదన్నాడు. ఆత్మాహుతి దాడిని ప్రజాస్వామ్యమే కాదు.. మరే ఇతర నాగరిక సమాజం కూడా అంగీకరించదన్నాడు. కానీ.. ఇస్లాంలో ఆత్మాహుతి దాడిని బలిదాన ఆపరేషన్ గా చూస్తారని, ఎవరూ మరణానికి భయపడవద్దని తెలిపాడు. ఈ ప్రపంచం ఆత్మాహుతి దాడిని తప్పుగా అర్థం చేసుకుందని, ఇది అమరులయ్యే ఆపరేషన్ అని చెప్పుకొచ్చాడు. తాజాగా వెలుగుచూసిన ఈ వీడియో.. ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ పేలుడు పదార్థాలు తరలిస్తుండగా.. అనుకోకుండా జరిగి ఉండవచ్చన్న వాదనలను కొట్టిపారేసేలా ఉండటం గమనార్హం.






