- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Delhi Red Fort Blast : ఎర్రకోట పేలుళ్ల వెనుక ఉగ్ర కుట్ర..?
ఎర్రకోట పేలుళ్ల వెనుక ఉగ్ర కుట్ర..?

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ(Delhi)లో సంభవించిన పేలుడు ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నెంబర్-1 వద్ద ఘటన ఈ ఘటన చోటుచేసుకుంది. దీని వెనుక ఉగ్రవాదుల(Terror Attack) హస్తం ఉందా? అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. ఢిల్లీ పోలీసు విభాగానికి చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందం సహా క్లూస్ టీమ్, ఎన్‌ఐఏ రంగంలోకి దిగాయి. కారులో పేలుడు పదార్ధాలని ఉంచి రిమోట్ సాయంతో పేల్చారా? అని అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రతి సోమవారం ఢిల్లీలో పర్యాటక ప్రదేశాలు, మార్కెట్లకి సెలవు.. దీంతో ప్రమాద తీవ్రత తక్కువగా ఉందని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. క్లూస్ టీమ్ ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ భారీ పేలుడు వల్ల తొమ్మిది మంది మృతి చెందారు. 24 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఎల్‌ఎన్‌జేపీ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పేలుడు ధాటికి మృతదేహాలు ఛిద్రమయ్యాయి.






