J&K: జమ్మూకశ్మీర్‌లో 'ఫేషియల్ రికగ్నిషన్' ద్వారా ఉగ్రవాద అనుమానితుడి అరెస్ట్

by S Gopi |

ఉగ్రవాద అనుమానితులను పటుకునేందుకు చేసిన తనిఖీల్లో భాగంగా పోలీసు అధికారులు అత్యాధునిక టెక్నాలజీని వాడారు.

J&K: జమ్మూకశ్మీర్‌లో ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా ఉగ్రవాద అనుమానితుడి అరెస్ట్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇటీవల ఏర్పాటు చేసిన ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా అనంతనాగ్ పోలీసులు ఓ అనుమానితుడిని అరెస్టు చేశారని, ఆ వ్యక్తి ఉపా (చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం) కేసులో ప్రమేయం ఉందని పోలీసు అధికారులు వెల్లడించారు. పెహల్గాం దాడి తర్వాత జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల వేటను మొదలుపెట్టిన సైన్యం కీలక పురోగతిలో భాగంగా అనంతనాగ్‌ పోలీసులు డ్రాంగ్‌బాల్ పాంపోర్‌లోని మాలిక్ మొహల్లా నివాసి మునీబ్ ముష్తాక్ షేక్‌గా గుర్తించి అరెస్ట్ చేశారు. ఉగ్రవాద అనుమానితులను పటుకునేందుకు చేసిన తనిఖీల్లో భాగంగా పోలీసు అధికారులు అత్యాధునిక టెక్నాలజీని వాడారు. అనంత్‌నాగ్‌లో పట్టుకున్న వ్యక్తిని ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ఉపయోగించినట్టు తెలిపారు. గనీష్‌బల్‌లో ఎక్స్‌రే పాయింట్ వద్ద ఈ టెక్ సిస్టమ్‌ను పోలీసులు ఏర్పాటు చేశారు. ఉగ్రవాద నిందితుడిని గుర్తించిన వెంటనే కంట్రోల్ రూమ్ సమాచారం వచ్చిందని, పోలీసులు అక్కడకు చేరుకుని మునీబ్ ముష్తాక్‌ను అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్‌కు తరలించినట్టు అధికారులు వివరించారు. అనంతరం చేపట్టిన విచారణలో సదరు ఉగ్రవాదిపై ఉపా చట్టం కింద కేసులో ప్రమేయం ఉన్నట్టు ధృవీకరించారు. తదుపరి ప్రక్రియ కోసం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన పోలీసు ఉన్నతాధికారి ఒకరు, జమ్మూకశ్మీర్‌లో శాంతి భద్రతలను మెరుగుపరిచేందుకు, నిందితులను పట్టుకునేందుకు అత్యాధునిక నిఘా టెక్నాలజీ ఎంతో సహాయమందిస్తోందని, ఇందుకు ఈ అరెస్టు సాక్ష్యమని పేర్కొన్నారు.

Next Story