- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కర్రెగుట్టల్లో మళ్లీ హైటెన్షన్
కర్రెగుట్టలో మరోసారి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ములుగు జిల్లా ముకునూరుపాలెం అటవీ ప్రాంతంలో ప్రెజర్ బాంబ్ పేలడంతో బలగాలు అప్రమత్తం అయ్యాయి.

దిశ, వెబ్ డెస్క్: కర్రెగుట్టలో మరోసారి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ములుగు జిల్లా ముకునూరుపాలెం అటవీ ప్రాంతంలో ప్రెజర్ బాంబ్ పేలడంతో బలగాలు అప్రమత్తం అయ్యాయి. కర్రెగుట్ట శివారు ప్రాంతాలను మరోసారి జల్లెడ పడుతున్నారు. అనుమానితులు సంచరిస్తున్నారని సమాచారం అందడంతోనే బలగాలు అక్కడకు చేరుకున్నట్టు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మావోయిస్టులను పూర్తిగా అంతం చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే మావోయిస్టుల్లో ప్రముఖులను కేంద్ర కమిటీ సభ్యలను సైతం హతమార్చారు. కేంద్ర బలగాలు కర్రెగుట్టలో భీకర దాడులు చేసి మావోయిస్టులను చంపేశాయి. కొంతమంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. తరవాత బలగాలు కర్రెగుట్టపై జెండా పాతి వెనక్కితగ్గాయి. ఇటీవల జరిగిన బ్లాస్ట్ తో మరోసారి జల్లెడపడుతున్నాయి.






