- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హర్మూజ్ జలసంధిలో మళ్లీ ఉద్రిక్తత.. భారత నౌకలపై IRGC కాల్పులు..!
హార్ముజ్ జలసంధిలో భారత ఆయిల్ ట్యాంకర్లపై ఇరాన్ (IRGC) బలగాలు కాల్పులు జరిపాయి.

దిశ, వెబ్‌డెస్క్: హర్ముజ్ జలసంధి (Strait of Hormuz) వద్ద మరోసారి తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇరాన్ తీరం మీదుగా ప్రయాణిస్తున్న రెండు భారతీయ నౌకలపై ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కోర్ (IRGC) కాల్పులు జరిపినట్లుగా ఆ దేశ మీడియా వెల్లడించింది. ఇరాక్ నుంచి సుమారు 20 లక్షల బ్యారెళ్ల ముడి చమురుతో వెళ్తున్న ఒక భారీ ఆయిల్ ట్యాంకర్‌తో పాటు మరో భారతీయ నౌకను ఇరాన్ సేనలు అడ్డుకున్నాయి. హర్ముజ్ జలసంధిని దాటేందుకు ప్రయత్నించిన క్రమంలో ఇరాన్ బలగాలు ఈ నౌకలపై కాల్పులకు తెగబడ్డాయి. కాల్పుల తీవ్రత పెరగడంతో ప్రమాదాన్ని పసిగట్టిన భారత నౌకలు తమ ప్రయాణాన్ని రద్దు చేసుకున్నాయి. హర్ముజ్ నుంచి తిరిగి వెనక్కి వెళ్లిపోయినట్లుగా సమాచారం.
అయితే, అదృష్టవశాత్తూ ఈ ఘటనలో నౌకలకు గానీ, అందులోని సిబ్బందికి గానీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. నౌకలతో పాటు సిబ్బంది అందరూ క్షేమంగా ఉన్నారని ప్రాథమిక సమాచారం అందుతోంది. అంతర్జాతీయ జలాల్లో వాణిజ్య నౌకలపై ఈ రకమైన దాడులు జరగడాన్ని భారత ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని ఇరాన్ రాయబారిని పిలిపించి కేంద్ర ప్రభుత్వం సమన్లు (Summons) ఇచ్చే అవకాశం ఉంది. అసలు కాల్పులు జరపడానికి గల కారణాలను వివరించాలని భారత్ డిమాండ్ చేసే దిశగా అడుగులు వేస్తోంది.






