- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Drone: ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య వార్ వేళ జమ్మకశ్మీర్‍లో డ్రోన్ల కలకలం

దిశ, డైనమిక్ బ్యూరో: ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా క్షిపణులతో విరుచుకుపడుతున్న వేళ జమ్ముకశ్మీర్‍లో (Jammu and Kashmir) డ్రోన్లు కలకలం రేపాయి. ఆదివారం తెల్లవారుజామున పూంచ్ జిల్లాలోని (Poonch) నియంత్రణ రేఖ వద్ద డ్రోన్లు చొరబాటుకు యత్నించాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు డ్రోన్లపై కి (Drones) కాల్పులు జరిపాయి. దీంతో ఆ డ్రోన్లు పీవోకే వైపు వెనక్కి వెళ్లాయి. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం మన దళాలు ఇవాళ ఉదయం 5:45 -6:00 గంటల మధ్య అనుమానాస్పద వైమానిక కదలికను గుర్తించాయి. ఆ సమయంలో రెండు నుండి మూడు చిన్న క్వాడ్‌కాప్టర్లు భారత గగనతలాన్ని ఉల్లంఘించడానికి ప్రయత్నించాయి. గ్రౌండ్ యూనిట్లు వెంటనే కౌంటర్-డ్రోన్ చర్యలను ప్రారంభించాయడంతో అవి వెనుదిరిగాయని అధికారులు తెలిపారు. కాగా సరిహద్దు అవతల నుంచి డ్రోన్ కదలికలను భద్రతా దళాలు గర్తించి కాల్పులు జరపడం మూడు రోజుల్లో ఇది రెండోసారి.






