కాలేజీలో ఉద్రిక్తత.. కర్రలు, రాడ్‌లతో కొట్టుకున్న విద్యార్థులు

by Ramesh Naini |

జైపూర్‌లోని ప్రతిష్ఠాత్మక మహారాజా కాలేజీ క్యాంపస్‌లో హింసాత్మక ఘటన చోటుచేసుకున్నట్లు వీడియో వైరల్ అవుతోంది.

కాలేజీలో ఉద్రిక్తత.. కర్రలు, రాడ్‌లతో కొట్టుకున్న విద్యార్థులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: జైపూర్‌లోని ప్రతిష్ఠాత్మక మహారాజా కాలేజీ క్యాంపస్‌లో హింసాత్మక ఘటన చోటుచేసుకున్నట్లు వీడియో వైరల్ అవుతోంది. గోఖలే హాస్టల్‌ ద్వారం వద్ద తాజాగా పలువురు గుర్తు తెలియని వ్యక్తులు విద్యార్థులపై కర్రలు, ఇనుపరాడ్‌లతో దాడి చేశారు. ఈ దాడిలో అనేక మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. సోషల్ మీడియాలో ఈ దాడికి సంబంధించిన వీడియో విస్తృతంగా వైరల్ కావడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. వీడియో ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ప్రాథమిక సమాచారం మేరకు వ్యక్తిగత శత్రుత్వం, గుంపుల మధ్య పాత విభేదాలే ఈ దాడికి కారణమని తెలుస్తోంది. స్టూడెంట్స్‌ రెండు వర్గాలుగా చీలిపోవడంతో ఘర్షణ తీవ్రరూపం దాల్చిందని పోలీసులు అనుమానిస్తున్నారు. హింసాత్మక సంఘటనతో క్యాంపస్‌లో ఉద్రిక్తత నెలకొనగా, భద్రతను పెంచినట్లు కళాశాల యాజమాన్యం తెలిపింది. వీడియో ఇదే..

Next Story