- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BJP: పార్లమెంట్ వద్ద హైటెన్షన్.. రాహుల్ గాంధీపై బీజేపీ ఫైర్
'ఓట్ల చోరీ' అంశం, బిహార్ లో ఓట్ల జాబితా సవరణకు నిరసనగా ఇండియా కూటమి నేతలు చేపట్టిన ఆందోళనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

దిశ, డైనమిక్ బ్యూరో: 'ఓట్ల చోరీ' అంశం, బిహార్ లో ఓట్ల జాబితా సవరణకు నిరసనగా ఇండియా కూటమి (India Alliance) నేతలు చేపట్టిన ర్యాలీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పార్లమెంట్ (Parliament) నుంచి ఈసీ (EC) ఆఫీస్ కు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో విపక్ష పార్టీల నేతలు మార్చ్ మొదలు పెట్టగా ఈ ర్యాలీకి (Opposition Rally) అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీకి ఎలాంటి అనుమతి తీసుకోలేదని బారికేడ్లతో సంసద్ మార్గ్ ను పోలీసులు బ్లాక్ చేశారు. దీంతో పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన విపక్ష ఎంపీలు రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపారు. ఈక్రమంలో సమాజ్ వాదిపార్టీ చీఫ్, ఎంపీ అఖిలేశ్ యాదవ్ పోలీస్ బారికేడ్లు దూకారు. మరి కొంత మంది ఎంపీలు సైతం బారికేడ్లు ఎక్కి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అక్కడ ఒక్కసారిగా హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఈ క్రమంలో అక్కడ భారీగా మోహరించిన పోలీసులు రాహుల్ గాంధీ(Rahul Gandhi), ప్రియాంక గాంధీ సహా ఇండియా కూటమి ఎంపీలను అరెస్టు చేసి బస్సుల్లో ఇతర చోటకు తరలించారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ, ఎన్సీపీ(ఎస్పీ) అధినేత శరద్ పవార్, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ అఖిలేశ్ యాదవ్ సహా దాదాపు 300 మంది లోక్‌సభ, రాజ్యసభ విపక్ష ఎంపీలు పాల్గొన్నారు.
30 మందికే అనుమతి:
ఇదిలా ఉంటే బిహార్ లో చేపట్టిన సమగ్ర సవరణ సర్వే సహా పలు అంశాలపై మాట్లాడేందుకు సమయం ఇవ్వాలని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ రాసిన లేఖకు ఈసీ స్పందించింది. విపక్షాలతో భేటీకి అంగీకరించింది. అయితే కేవలం 30 మంది విపక్ష ఎంపీలు మాత్రమే సమావేశానికి రావాలని ఈసీ ఇవాళ మధ్యాహ్నం అపాయింట్ మెంట్ ఇచ్చింది. అయితే ఇండియా కూటమి ర్యాలీలో మాత్రం వెళ్తే తామందరం వెళ్తామని ఎంపీలు నినాదాలు చేశారు.
నిజం ప్రజల ముందుంది: రాహుల్ గాంధీ
తాము చేస్తున్న ఈ పోరాటం రాజకీయం కోసం కాదని రాజ్యాంగం కాపాడేందుకే మా పోరాటం అని రాహుల్ గాంధీ అన్నారు. పోలీసులు అరెస్ట్ చేసి తరలిస్తున్న సమయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఓట్ల చోరీ విషయంలో వాస్తవం ఏమిటో ప్రజల ముందు ఉందని కానీ ఈ వాస్తవాలపై ఈసీ, బీజేపీ మాట్లాడలేరని విమర్శించారు. తాము పారదర్శకమైన ఓటర్ల జాబితా కోరుతున్నామన్నారు.
ర్యాలీపై బీజేపీ ఆగ్రహం:
ఇండియా కూటమి చేపట్టిన ర్యాలీపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ మీడియాతో మాట్లాడుతు విపక్షాలు ఒక అబద్ధాన్ని పదే పదే చెబుతూ ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్షాలది ఓటు బ్యాంకు రాజకీయం అని మండిపడ్డారు. అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు తిరస్కరించారన్నారు.






