భవానీపుర్‍లో తీవ్ర ఉద్రిక్తత.. బీజేపీపై మమత బెనర్జీ సంచలన ఆరోపణలు

by Prasad Jukanti |

భవానీపుర్‍లో తీవ్ర ఉద్రిక్తత.. బీజేపీపై మమత బెనర్జీ సంచలన ఆరోపణలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: పశ్చిమ బెంగాల్‍లో రెండో విడత పోలింగ్ రోజు పలు చోట్ల తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బీజేపీ నేత సువేందు అధికారి పోటీ చేస్తున్న భవానీపుర్ నియోజకవర్గంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇక్కడ బీజేపీ రిగ్గింగ్‍కు పాల్పడుతోందని మహిళా ఓటర్లపై దాడి చేస్తున్నారని స్వయంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించడం కలకలం రేపింది. పోలింగ్ సందర్భంగా భవానీపుర్ నియోజకవర్గానికి మమతా వెళ్లారు. అదే సమయంలో దీదీపై పోటీ చేస్తున్న సువేందు అధికారి కూడా అక్కడికి వచ్చారు. మమతను ఉద్దేశించి ‘ఆమెను చూడండి. ఆమెకు ఈ రోజు ఎవరూ ఓటేయరు అని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో బీజేపీ, ఎన్నికల సంఘంపై మమతా ఫైర్ అయ్యారు.

రాత్రి నుంచి కొడుతున్నారు:

భవానీపూర్ నియోజకవర్గంలోని పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటు వేసేందుకు వచ్చిన మహిళా ఓటర్లను ప్రత్యర్థి వర్గం వారు అడ్డుకున్నారని ఆరోపించారు. కేంద్ర బలగాలకు చెందిన సభ్యులు మా పార్టీ కార్యకర్తల ఇళ్లల్లోకి చొరబడి, ఓటర్లను భయపెడుతున్నారని ఈ ఎన్నికల్లో ఎన్నికల సంఘం పరిశీలకులు సైతం ఉగ్రవాదుల్లా ప్రవర్తిస్తున్నారని హాట్ కామెంట్స్ చేశారు. తృణమూల్ కార్యకర్తను రాత్రి ఎలా కొట్టారో చూడండి. ఇదేం గూండాయిజం..? ఓటింగ్ ఇలా జరగకూడదు. ఎన్నికలంటే ప్రజాస్వామ్య పండగ. కానీ వారు పండగ స్ఫూర్తినే దెబ్బతీస్తున్నారని దుయ్యబట్టారు. మమత చేసిన ఆరోపణలకు సువేందు అధికారి కౌంటర్ ఇచ్చారు. ఆమె గూండాలను వెంటేసుకొని తిరుగుతూ ఓటర్లను భయపెడుతున్నారని ఆరోపించారు. దీంతో పోలింగ్ నాడు మమతా వర్సెస్ సువేందు మధ్య హైవోల్టేజ్ పాలిటిక్స్ నడిచింది.

Next Story