తల్లి పుట్టినరోజు నెంబర్‌తో అదృష్టం.. రూ. 240 కోట్ల లాటరీ గెలుచుకున్న తెలుగు యువకుడు

by Malleboina Mahesh |

తల్లి పుట్టినరోజు నెంబర్‌తో అదృష్టం వరించి.. తెలుగు యువకుడు యూఏఈలో రూ 240 కోట్ల లాటరీ గెలుచుకున్నాడు

తల్లి పుట్టినరోజు నెంబర్‌తో అదృష్టం.. రూ. 240 కోట్ల లాటరీ గెలుచుకున్న తెలుగు యువకుడు
X

దిశ, వెబ్ డెస్క్: తల్లి పుట్టినరోజు నెంబర్‌ ఓ యువకుడిని ఒక్కసారిగా కోటీశ్వరుడిని చేసింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ. 240 కోట్లను లాటరీ (Lottery)లో తెలుగు యువకుడు గెలుచుకున్నాడు. ఈ ఆశ్చర్యకరమైన ఘటన అబుదాబి నగరం (Abu Dhabi City)లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. యూఏఈలో పని చేసే బోళ్ల అనిల్ కుమార్ (29) అనే ఈ తెలుగు యువకుడు తన తల్లి పుట్టినరోజు తేదీని లాటరీ నెంబర్‌గా ఎంచుకున్నాడు. అయితే ఈ నెల 18న జరిగిన డ్రాలో 100 మిలియన్ దిర్హామ్స్ (సుమారు ₹240 కోట్లు) గెలుచుకున్నాడు. అనిల్ కుమార్ గత కొన్నేళ్లుగా అబుదాబిలో నివసిస్తూ చిన్న ఉద్యోగం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు.

చాలా సంవత్సరాలుగా అక్కడే ఉంటున్న అనిల్ కుమార్ (Anil Kumar)కు లాటరీ టికెట్లు కొనడం అలవాటుగా మారింది. ఈ క్రమంలోనే ఈసారి కూడా ఎలాంటి ఆశలు లేకుండా టికెట్ కొన్నాడు. కానీ తల్లి పుట్టినరోజు నంబర్‌ను చివరగా పెట్టడంతో అదృష్టం అతన్ని వరించింది. ఈ భారీ బహుమతి (huge gift) గెలిచిన తర్వాత అనిల్ కుమార్ తన తల్లిదండ్రులను అబుదాబికి తీసుకువెళ్లి అక్కడే స్థిరపడాలని సంకల్పంతో ఉన్నారు. ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ.. “ఒక లగ్జరీ కారు కొనాలనుకుంటున్నాను, కొంత డబ్బును చారిటీ సంస్థలకు విరాళంగా ఇస్తాను,” అని అనిల్ కుమార్ తెలిపారు. అదే లాటరీ భారత్‌లో గెలిస్తే దాదాపు ₹90 కోట్లు పన్నుగా చెల్లించాల్సి వచ్చేదని, కానీ యూఏఈలో లాటరీపై ఎలాంటి పన్ను లేకపోవడం తన అదృష్టాన్ని మరింత పెంచిందని అనిల్ హర్షం వ్యక్తం చేశారు.

Next Story