న్యూ హిస్టరీ..అంతరిక్షంలోకి వెళ్లనున్న తెలుగు కుర్రాడు..?

by Disha Web Desk 18 |
న్యూ హిస్టరీ..అంతరిక్షంలోకి వెళ్లనున్న తెలుగు కుర్రాడు..?
X

దిశ,వెబ్‌డెస్క్: ఇటీవల కాలంలో భారతీయులు ఎంతోమంది ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అవుతున్న విషయం తెలిసిందే. ప్రపంచంలోని టాప్ కంపెనీలకు సీఈఓ, శాస్త్రవేత్తలుగా ఇలా తాము ఎంచుకున్న రంగాల్లో ముందంజలో ఉంటున్నారు. ఈ క్రమంలో తాజాగా తెలుగు వ్యక్తి అంతరిక్షం లోకి వెళ్లబోతున్నారు. ఈ రకంగా అతను రికార్ఢ్ సృష్టించబోతున్నట్లు తెలుస్తోంది. అంతరిక్షంలోకి తెలుగు కుర్రాడు వెళ్లునున్నారు. గోపీచంద్ తోటకూర త్వరలో అంతరిక్షంలోకి అడుగుపెట్టనున్నారు. కాగా 30 ఏళ్ల గోపీచంద్ ఏపీ లోని విజయవాడకు చెందిన కుర్రాడు. ఆయన ఒక పైలట్, ఏవియేటర్. ఆయన విద్యాభ్యాసం ఫ్లోరిడా, దుబాయ్ లో కొనసాగింది. ప్రస్తుతం గోపి అమెరికాలో నివసిస్తున్నారు. బ్లూ ఆరిజన్ న్యూ షెఫర్డ్-25 మిషన్ కోసం ఆయన ఎంపికయ్యారు. ఆయనతో పాటు మరో ఐదుగురు స్పేస్‌లోకి వెళ్లనున్నారు. దీనికి సంబంధించిన మిషన్ ప్రయోగ తేదీ ఇంకా వెల్లడించలేదు.

Read More..

ప్రజా శాంతి పార్టీ గుర్తు ఇదే..

Next Story

Most Viewed