కర్నాటకలో దుకాణాల తెలుగు బోర్డులు తొలగింపు

by Ajay Maddhiboyina |

కర్నాటకలో గత కొంతకాలంగా భాషా వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అప్పట్లో స్టార్ హీరో క‌మ‌ల్ హాస‌న్ త‌మిళ్ నుండే తెలుగు పుట్టింది అని చెప్ప‌డంతో పెద్ద వివాదం రాజుకుంది.

కర్నాటకలో దుకాణాల తెలుగు బోర్డులు తొలగింపు
X

దిశ, వెబ్ డెస్క్: కర్నాటకలో గత కొంతకాలంగా భాషా వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అప్పట్లో స్టార్ హీరో క‌మ‌ల్ హాస‌న్ త‌మిళ్ నుండే తెలుగు పుట్టింది అని చెప్ప‌డంతో పెద్ద వివాదం రాజుకుంది. త‌ర‌వాత‌ ఓ బ్యాంకు ఉద్యోగి హిందీలో మాట్లాడగా కన్నడలోనే మాట్లాడాలని కస్టమర్ వాగ్వాదానికి దిగిన వీడియో వైరల్ అయింది. ఇటీవ‌ల‌ ఓ టాక్సీ డ్రైవర్‌తోనూ అలాంటి గొడవే జరిగింది. కాగా తాజాగా కన్నడనాట మరో కొత్త వివాదం మొదలైంది. విజయనగ జిల్లా కర్నాటక రక్షణ వేదిక బల్లారి ప్రెసిడెంట్ జి. రాజశేఖర్ రాజన్న దుకాణాలకు ఉన్న తెలుగు బోర్డులను తొలగించారు.

ఆయన మరికొంతమందితో కలిసి వచ్చి ఆకృతి అనే వ‌స్త్ర దుకాణం బోర్డుల‌ను తొల‌గించారు. మ‌రోసారి అలాంటి తెలుగు బోర్డుల‌ను పెట్ట‌వ‌ద్ద‌ని షాపు వారికి సూచించారు. అయితే రాజ‌శేఖ‌ర్ రాజ‌న్న ఇంగ్లీష్ బోర్డును మాత్రం తొల‌గించ‌లేదు. ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. దీంతో నెటిజ‌న్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. అన్ని భార‌తీయ భాష‌ల‌ను గౌర‌వించాల‌ని కానీ భార‌తీయ భాష తెలుగును అవ‌మాన‌ప‌ర్చ‌డం, ఇంగ్లీష్ ను గౌర‌వించ‌డం ఏం ప‌ద్ద‌తి అని ప్ర‌శ్నిస్తున్నారు.

Next Story