- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం నిధులు సున్నా
తెలంగాణకు మరోసారి మొండిచెయ్యి ఎదురైంది.

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణకు మరోసారి మొండిచెయ్యి ఎదురైంది. కేంద్రం అందించే నిధుల విషయంలో, పథకాల విషయంలో బీజేపీయేతర రాష్ట్రాలపై చిన్నచూపు చూస్తుందని మరోసారి రుజువైంది. కాగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన - గ్రామీణ్ పథకం 2025-26 కు చెందిన నిధులలో తెలంగాణకు నయాపైసా కేటాయించలేదు. ఈ విషయాన్ని కేంద్రం నేడు పార్లమెంటులో స్వయంగా వెల్లడించింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన - గ్రామీణ్ పథకం కింద ఏ రాష్ట్రానికి ఎన్ని నిధులు కేటాయించారో తెలపాలని మహారాష్ట్రకు చెందిన పార్లమెంటు సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్రమంత్రి సమాధానమిచ్చారు.
ఈ పథకం కింద గడిచిన 4 ఏళ్లలో మొత్తం రూ.1,12,647.16 కోట్లు విడుదల చేశామని తెలిపారు. ఇందులో ఏపీకి రూ.427.6 కోట్లు విడుదలవగా.. తెలంగాణ, పశ్చిమ బెంగాల్ కు రూపాయి కూడా విడుదల చేయలేదు. బీజేపీ పాలిత రాష్ట్రాలు, ఆ పార్టీ మిత్రపక్ష పార్టీల రాష్ట్రాలకు అత్యధిక వాటా దక్కింది. అలాగే త్వరలో ఎన్నికలు జరగనున్న తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాలకు కూడా నిధులు కేటాయించడం గమనార్హం.






