- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ - ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో హైఅలర్ట్
తెలంగాణ - ఛత్తీస్‌గఢ్(Telangana-Chhattisgarh) సరిహద్దులో పోలీసులు హైఅలర్ట్(High Alert) ప్రకటించారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ - ఛత్తీస్‌గఢ్(Telangana-Chhattisgarh) సరిహద్దులో పోలీసులు హైఅలర్ట్(High Alert) ప్రకటించారు. ఎన్‌కౌంటర్‌లకు నిరసనగా మావోయిస్టులు బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో బలగాలు అప్రమత్తమయ్యాయి. చర్ల, పూసుగుప్ప, మరాయిగూడెం, పైడిపల్లి, దుమ్ముగూడెం అటవీప్రాంతంలో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఎన్‌కౌంటర్‌లకు నిరసనగా ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, సుక్మ, దంతెవాడ జిల్లాల బంద్‌కు మావోయిస్టు(Maoists)లు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.
బంద్ నేపథ్యంలో చింతూరు మండలం ఏడుగురాళ్లపల్లి మీదుగా తెలంగాణకు రాత్రిపూట వెళ్లే వాహనాలను కూనవరం మండలం భీమవరం మీదుగా దారి మళ్లించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన అల్లిగూడెంకు ప్రతిరోజూ మండలంలోని వెళ్లే పాసింజర్ షటిల్ బస్సు సర్వీసును రద్దుచేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకున్నామని, సర్కిల్ పరిధి లోని రాజకీయ నాయకులకు నోటీసులు జారీచేసి, అప్రమత్తం చేసినట్టు పోలీసులు తెలిపారు. కాగా, ఇటీవల వరుసగా ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లలో పదుల సంఖ్యలో మావోయిస్టులు మృతిచెందారు.






