తేజస్వి రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకం!

by Muthe.Rajitha |

బిహార్‌ ఎన్నికల్లో మరోసారి ఎన్డీయే కూటమి భారీ విజయం సాధించింది.

తేజస్వి రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకం!
X

దిశ, వెబ్ డెస్క్ : బిహార్‌ ఎన్నికల్లో మరోసారి ఎన్డీయే కూటమి భారీ విజయం సాధించింది. కాగా ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని శాయశక్తులా ప్రయత్నం చేసి... ఓటమి పాలైంది మహాగఠ్‌బంధన్‌. ఇక ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌కు మరోసారి తీవ్ర నిరాశే ఎదురైంది. 2015లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తేజస్వీకి పదేళ్లయినా విజయం అందని ద్రాక్షగా మారింది. 2015లో నితీశ్‌తో కలిసి పోటీచేసి.. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహించారు.

నితీశ్‌ తిరిగి భాజపాతో జట్టు కట్టడంతో.. ఆ పొత్తు కాదని బయటికి వచ్చి, ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నారు. తాజాగా జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా పరాజయం కావడంతో తేజస్వీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది అంటున్నారు రాజకీయ నిపుణులు.

Next Story