బీహార్‌ కౌంటింగ్‌లో కుట్రకు ప్లాన్.. తేజస్వీ సంచ‌ల‌నం

by velandi.Saikiran |

మరికొన్ని గంటల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది.

బీహార్‌ కౌంటింగ్‌లో కుట్రకు ప్లాన్.. తేజస్వీ సంచ‌ల‌నం
X

దిశ‌, వెబ్ డెస్క్‌: మరికొన్ని గంటల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇలాంటి నేపథ్యంలో ప్రతిపక్ష నాయకులు, RJD నేత తేజస్వీ యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను ఆలస్యం చేసేందుకు కుట్ర జరుగుతోందని బాంబు పేల్చారు. మహాఘటబంధన్ (Mahagarbhandan) అభ్యర్థులు గెలిస్తే ప్రకటించకూడదని, ఎన్డీఏ అభ్యర్థుల గెలుపును మాత్రం మొదట ప్రకటించాలని అధికారులకు చెప్పినట్లు తేజస్వీ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ మేరకు అధికారులకు ఫోన్లు కూడా వెళ్లినట్లు తమకు సమాచారం వచ్చిందని స్పష్టం చేశారు. క్లియర్ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అయితే ఈ ఎన్నికల నేపథ్యంలో ఎన్డీఏ కూటమి కుట్రలు పండిందని ఫైర్ అయ్యారు. కాగా మెజారిటీ స‌ర్వేలు మాత్రం ఎన్డీఏకు అనుకూలంగా ఉన్నాయి. ఇది ఇలా ఉండగా బీహార్ రాష్ట్రంలో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అంటే బీహార్ లో అధికారం దక్కాలంటే ఖచ్చితంగా 122 మ్యాజిక్ ఫిగర్ దాటాల్సిందే. మరి ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో చూడాలి.

Next Story