- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాంగ్రెస్ నిరక్షరాస్యుల పార్టీ.. మరోసారి తేజస్వి సూర్య వివాదస్పద వ్యాఖ్యలు
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై లోక్‌సభలో తాను చేసిన వ్యాఖ్యలపై రేగుతున్న దుమారంపై బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య మరోసారి వివరణ ఇచ్చారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై లోక్‌సభలో తాను చేసిన వ్యాఖ్యలపై రేగుతున్న దుమారంపై బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య మరోసారి వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ పార్టీపై విమర్శనాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్ నాయకులు ఉద్దేశపూర్వకంగానే తన మాటలను వక్రీకరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. నేను లోక్‌సభలో ఏం మాట్లాడానో మరోసారి కాంగ్రెస్ నేతలు శ్రద్ధగా వినాలి. నా మాటల్లోని అసలు అర్థాన్ని తెలుసుకోకుండా రాద్ధాంతం చేయడం సరికాదు. నేను మాట్లాడినవి చాలా సింపుల్ మాటలు. వీలైతే వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీని "నిరక్షరాస్యుల పార్టీ" (Illiterate Party)గా అభివర్ణిస్తూ తేజస్వి సూర్య తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేతలు ఉద్దేశపూర్వకంగా, లేదా అజ్ఞానంతోనే ఈ నిరసనలు చేస్తున్నారు. నా మాటలను తప్పుగా అర్థం చేసుకుని ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారు అని తేజస్వి సూర్య కీలక వ్యాఖ్యలు చేశారు.
కాగా, ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా తెలంగాణ ఏర్పాటు ప్రక్రియపై తేజస్వి సూర్య చేసిన కొన్ని వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఆయన వ్యాఖ్యలను తెలంగాణ ఆత్మగౌరవానికి భంగం కలిగించేవిగా అభివర్ణిస్తూ క్షమాపణలు డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే ఆయన తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని తెలుపుతూ, కాంగ్రెస్ తీరును తప్పుబట్టారు.






