- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Tejaswi: ప్రతి ఇంటికీ ఒక ప్రభుత్వ ఉద్యోగం.. బిహార్‌లో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ హామీ
బిహార్‌లో తాము అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఉండేలా చట్టం తీసుకొస్తామని తేజస్వీ యాదవ్ ప్రకటించారు.

దిశ, నేషనల్ బ్యూరో: బిహార్‌లో తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని ప్రతి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఉండేలా చట్టం తీసుకొస్తామని రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) నేత తేజస్వీ యాదవ్ (Tejaswi Yadav) ప్రకటించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన 20 రోజుల్లోపు ఈ ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. 20 నెలల్లోనే దీనిని అమలు చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గురువారం ఆయన పాట్నాలో మీడియాతో మాట్లాడారు. 20 ఏళ్లలో యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడంలో ఎన్డీయే ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. గత ఎన్నికల్లో కూడా ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చానని, తాను అధికారంలో ఉన్న కొద్ది కాలంలోనే ఐదు లక్షల ఉద్యోగాలు భర్తీ చేశానని గుర్తు చేశారు. తనకు ఐదేళ్ల పాటు అధికారం ఉంటే ఎన్ని ఉద్యోగాలు ఇస్తానో ప్రజలు ఊహించుకోవచ్చని తెలిపారు. సీఎం నితీశ్ ఒక క్యాప్ కట్ అని విమర్శించారు. ఇటీవల ఎన్డీయే ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాలు గత ఎన్నికల టైంలో మేము ఇచ్చిన హామీలను పోలీ ఉన్నాయన్నారు.
జన్ సూరజ్ తొలి జాబితా రిలీజ్
బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు గాను ప్రశాంత్ కిషోర్ (Prashanth Kishore) నేతృత్వంలోని జన్ సూరజ్ పార్టీ తన తొలి జాబితాను రిలీజ్ చేసింది. 51 మంది అభ్యర్థుల పేర్లను వెల్లడించింది. అందులో మాజీ వీసీ, రిటైర్డ్ బ్యూరోక్రాట్లు, న్యాయవాదులు, డాక్టర్లు, గణిత శాస్త్రవేత్త సహా పలువురు ఉన్నారు. అయితే తాను ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రశాంత్ కిషోర్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. అన్ని నియోజకవర్గాల్లో పర్యటించాలి కాబట్టి పోటీకి దూరంగా ఉండనున్నట్టు సమాచారం.






