- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఒరిజినల్ సీఎం నేనే.. రాహుల్ ముందే తేజస్వి షాకింగ్ కామెంట్స్!
ఒరిజినల్ సీఎం తానే అంటూ బిహార్‌లో ఆర్జేడీనే ప్రధాన ప్రతిపక్షం అనే సంకేతాన్ని తేజస్వి యాదవ్ ఇచ్చారు. రాహుల్ ముందే తేజస్వి ఈ కామెంట్స్ చేయడం గమనార్హం.

దిశ, నేషనల్ బ్యూరో: ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఓటర్ అధికార్ యాత్ర’లో భాగంగా రాహుల్ గాంధీ, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌తో వేదిక పంచుకున్న తేజస్వి.. తనను తాను సీఎం అభ్యర్థిగా ప్రకటించుకున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఆరాలో ప్రజలనుద్దేశించి ప్రసంగించిన తేజస్వి.. బిహార్ సీఎం నితీశ్ కుమార్‌ను ‘నకిలీ సీఎం’ అని విమర్శించారు. ‘తేజస్వి ముందుకు దూసుకెళ్తుంటే. గవర్నమెంట్ కూడా వెనుకే వస్తోంది. మీకు ఆ నకిలీ సీఎం కావాలా? ఈ ఒరిజినల్ సీఎం కావాలా?’ అని ప్రజలను తేజస్వి అడిగారు.
దీంతో బిహార్‌లో ఇండియా కూటమిలో ‘పెద్దన్న పాత్ర’ ఆర్జేడీదే అని ముద్రవేసినట్లేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇన్నిరోజులు ఏ ప్రతిపక్ష నేత స్పష్టంగా తమ వైఖరి చెప్పకపోవడంతో బిహార్‌లో ప్రతిపక్ష కూటమికి నాయకత్వ వహిస్తోంది కాంగ్రెస్, ఆర్జేడీల్లో ఏ పార్టీ? అనే అనుమానాలు ఉండేవి. తాజా వ్యాఖ్యలతో ఈ రూమర్లకు ఫుల్‌స్టాప్ పెట్టేందుకు తేజస్వి ప్రయత్నిస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.






