- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాహుల్ లాగే తేజస్వీకి ఘోర ఓటమి తప్పదు.. జేఎస్పీ చీఫ్ ప్రశాంత్ కిషోర్ జోస్యం
2019లో అమేథీ నుంచి రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఓడినట్లుగానే బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ (Tejasvi Yadav)కు ఘోర ఓటమి తప్పదని ఎన్నికల వ్యూహకర్త, జన్ సూరజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిషోర్ (Prashanth Kishore) జోస్యం చెప్పారు.

దిశ, వెబ్‌డెస్క్: 2019లో అమేథీ నుంచి రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఓడినట్లుగానే బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ (Tejasvi Yadav)కు ఘోర ఓటమి తప్పదని ఎన్నికల వ్యూహకర్త, జన్ సూరజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిషోర్ (Prashanth Kishore) జోస్యం చెప్పారు. ఇవాళ పాట్నాలోని రఘోపూర్ (Raghopur)లో ఎన్నికల ప్రచారన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇదే రఘోపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న తేజస్వీ యాదవ్ అడ్రస్ గల్లంతవుతుందని అన్నారు.
తేజస్వీ యాదవ్ రఘోపూర్ నుంచి రెండు సార్లు గెలిచారని, 2019లో ఉత్తర ప్రదేశ్‌లోని అమేథీ లోక్‌సభ సీటులో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అవమానకర ఓటమి చూసినట్లే ఈ ఎన్నికల్లో తేజస్వీ ఓడిపోతరని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ అమేథీలో బీజేపీ నాయకురాలు స్మృతి ఇరానీ చేతిలో 15 ఏళ్ల పాటు కాంగ్రెస్ బలమైన కోటగా ఉన్న సీటును కోల్పోయిందని అన్నారు. ఇప్పుడు ఆర్జీడీకి అదే గతి పట్టబోతుందని ధ్వజమెత్తారు. రఘోపూర్ నియోజకవర్గంలో తేజ్వసీ యాదవ్ కుటుంబం దశాబ్దాలుగా ఆధిపత్యం చెలాయిస్తోందని కిషోర్ ఆరోపించారు. లాలూ ప్రసాద్ యాదవ్ 1995, 2000లో, రాబ్రీ దేవి 2005లో, తేజస్వీ యాదవ్ 2015, 2020లో ఇదే నియోజకవర్గం నుంచి గెలిచారని గుర్తు చేశారు. అయినప్పటికీ, రఘోపూర్‌లో ప్రాథమిక సౌకర్యాల కొరత ఉందని, ప్రజలు ఈ ఎన్నికల్లో వంశపారంపర్య ఆధిపత్యాన్ని అంతం చేయాలని కోరుకుంటున్నారని ప్రశాంత్ కిషోర్ కామెంట్ చేశారు.






