బీజేపీ మంత్రులు మటన్ తినటంపై తేజస్వీ యాదవ్‌ వివాదస్పద వ్యాఖ్యలు

by Yella Dhawani Reddy |   (  Updated:2025-07-23 08:29:15  IST  )

ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ బీజేపీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. శ్రావణ మాసం వంటి పవిత్ర సమయంలో కూడా బీజేపీ మంత్రులు మాంసాహారం తీసుకుంటున్నారని,

బీజేపీ మంత్రులు మటన్ తినటంపై తేజస్వీ యాదవ్‌ వివాదస్పద వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: బిహార్ రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు (Bihar Assembly Elections) జరగనున్న నేపథ్యంలో రాజకీయ వాతావరణం హీటెక్కింది. దీంతో అధికార జేడీయూ-బీజేపీ కూటమి, ప్రతిపక్ష ఆర్జేడీ మధ్య తీవ్ర మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆ రాష్ట్ర రాజకీయాల్లో ‘మటన్‌ పాలిటిక్స్‌’ హాట్‌ టాపిక్‌గా మారాయి. ఆర్జేడీ నేత, అసెంబ్లీలో విపక్ష నాయకుడు అయిన తేజస్వీ యాదవ్‌ (Tejashwi Yadav) బీజేపీ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. సనాతన ధర్మంపై బోధనలు చేసే వారు పవిత్ర శ్రావణ మాసంలో మాంసాహారం తీసుకుంటున్నారని బీజేపీ నేతలను విమర్శిస్తూ ఎక్స్‌లో ఓ వీడియో షేర్ చేశారు. 'ఆ మంత్రులు ఒక్కొక్కరూ కేజీ మటన్ తింటారు' అంటూ తీవ్ర వ్యంగ్యంతో వ్యాఖ్యానించారు. బీజేపీ నేతలు మాంసం తినడం ప్రధాని మోడీకి ఏమీ కాదని, ప్రతిపక్ష నాయకులు తింటే మాత్రం దాన్ని జాతీయ సమస్యగా మార్చే ప్రయత్నం చేస్తారని ఆయన మండిపడ్డారు. తమ పార్టీకి చెందిన నేతలు మాంసం తిన్నా, మత పరంగా తప్పుడు ప్రచారం చేస్తారని తేజస్వీ విమర్శించారు. కానీ అదే పని బీజేపీ మంత్రులు చేస్తే ఎవరూ ప్రశ్నించరని, ఇది బీజేపీ ద్వంద్వత్వానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు బీహార్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

కాగా, గత వారంలో కేంద్ర మంత్రి, జేడీయూ నేత రాజీవ్‌ రంజన్‌సింగ్‌ మటన్‌ పార్టీ ఏర్పాటు చేయడంపై తేజస్వీ యాదవ్‌ ఎన్డీయే, ప్రధాని మోడీ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. ఇక గతంలో 2024 లోక్‌సభ ఎన్నికల ముందు తేజస్వీ యాదవ్‌ లక్ష్యంగా బీజేపీ విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. నవరాత్రి సమయంలో తేజస్వీ చేపలు తిన్నారంటూ ఆయనను టార్గెట్‌ చేశారు. వసంత నవరాత్రి సమయంలో ఇదేమిటని మండిపడ్డారు. తేజస్వీ యాదవ్‌ ‘సీజనల్‌ సనాతన వాది అని’ విమర్శలు గుప్పించారు.

Next Story