- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బిహార్‌కు ముస్లిం డిప్యూటీ సీఎం.. తేజస్వీ యాదవ్ హామీ
బిహార్‌కు ముస్లిం డిప్యూటీ సీఎం వస్తారని, అలాగే దళితులు ఇతర వర్గాల నుంచి కూడా ఉపముఖ్యమంత్రులు ఉంటారని తేజస్వీ యాదవ్ ప్రకటించారు.

దిశ, నేషనల్ బ్యూరో: బిహార్‌లో ఒకరి కంటే ఎక్కువ మంది ఉపముఖ్యమంత్రులు ఉంటారని విపక్షాల సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్ ప్రకటించారు. ఎన్నికల ప్రచారం వేగం పుంజుకుంటున్న సమయంలో ఆయన తాజాగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా తాము గెలిస్తే ముస్లిం కమ్యూనిటత నుంచి కూడా డిప్యూటీ సీఎంను ఎన్నుకుంటామని తెలిపారు. సీట్ల పంపకం గురించి ప్రకటన చేసిన సమయంలో వికాస్ శీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ) చీఫ్ ముకేష్ సహానీని డిప్యూటీ సీఎం అభ్యర్థిగా మహాగఠ్‌బంధన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
అప్పటి నుంచి ముస్లింలకు కూడా డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలనే డిమాండ్లు పెరిగాయి. బిహార్‌లో 17 శాతం ముస్లింలు ఉన్న నేపథ్యంలో ఈ డిమాండ్‌కు కాంగ్రెస్ కూడా మద్దతిచ్చింది. ఈ క్రమంలోనే ముస్లింలు, దళితులు.. ఇలా వివిధ కమ్యూనిటీల నుంచి డిప్యూటీ సీఎంలు ఉంటారా? అని ప్రశ్నించగా అవునని తేజస్వీ బదులిచ్చారు. తాము అందర్నీ కలుపుకొని వెళ్తామని, ఆర్జేడీకి ఎప్పటి నుంచో ముస్లిం-యాదవ్ ఇమేజ్ ఉందని, దాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని ఆయన చెప్పారు. సమాజంలోని వివిధ వర్గాలు లేవనెత్తిన ప్రశ్నలన్నింటికీ బదులిస్తామని, తమ ప్రభుత్వంలో అందరికీ సమాన అవకాశాలు ఇస్తామని హామీ ఇచ్చారు.






