‘ఆ రొమాన్స్ వీడియోలో ఉన్నది నేను కాదు..’.. తేజ్ ప్రతాప్ వివరణ

by Gantepaka Srikanth |

ఆర్జేడీ(RJD) చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్(Lalu Prasad Yadav) సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీ నుంచి తన పెద్ద కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్‌(Tej Pratapn Yadav)ను సస్పెండ్ చేస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు.

‘ఆ రొమాన్స్ వీడియోలో ఉన్నది నేను కాదు..’.. తేజ్ ప్రతాప్ వివరణ
X

దిశ, వెబ్‌డెస్క్: ఆర్జేడీ(RJD) చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్(Lalu Prasad Yadav) సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీ నుంచి తన పెద్ద కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్‌(Tej Pratapn Yadav)ను సస్పెండ్ చేస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం ఆరేళ్ల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీ నుంచే కాదు.. ఆయన కుటుంబం నుంచి కూడా బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. తేజ్ ప్రతాప్ ప్రవర్తన అందరికీ చెడ్డపేరు తెచ్చేలా ఉందని.. కుటుంబ విలువలకు అనుగుణంగా లేదని మండిపడ్డారు. ఓ యువతితో తేజ్ ప్రతాప్ బహిరంగంగా రొమాన్స్ చేస్తున్నట్లు ఓ వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. దీనిపై రాష్ట్రంలోని అన్ని పార్టీ నేతలు లాలూ ఫ్యామిలీపై విమర్శలు చేశారు. దీంతో కుటుంబంపై ఇతరులు చేసే విమర్శలు తట్టుకోలేకపోయిన లాలూ.. అటు పార్టీ నుంచి, ఇటు కుటుంబం నుంచి తేజ్ ప్రతాప్‌‌ను సస్పెండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోపై తేజ్ ప్రతాప్ ఇప్పటికే స్పందించారు. దీనిపై ఆయన ఎక్స్ వేదికగా వివరణ ఇచ్చారు. తన సోషల్‌ మీడియాను ఎవరో హ్యాక్‌ చేశారని తెలిపారు. తన కుటుంబ గౌరవాన్ని దెబ్బతీసేందుకే ఎవరో ఇలాంటి పోస్టు చేశారని ఆరోపించారు. ఆ ఫొటో సైతం ఎడిట్ చేసిందని వెల్లడించారు. ఇలాంటి పుకార్లను నమ్మవద్దని తన అభిమానులను కోరారు.

Next Story