నా సోదరిని అంటే ఊరుకోను : తేజ్ ప్రతాప్ యాదవ్

by Muthe.Rajitha |

లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య తాను రాజకీయాలు, కుటుంబం నుంచి వైదొలగుతున్నానని ప్రకటించిన సంగతి తెలిసిందే.

నా సోదరిని అంటే ఊరుకోను : తేజ్ ప్రతాప్ యాదవ్
X

దిశ, వెబ్ డెస్క్ : లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య తాను రాజకీయాలు, కుటుంబం నుంచి వైదొలగుతున్నానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తన సోదరుడు తేజస్వీ యాదవ్ సహాయకులే తనను బయటకు పంపించారని, తనను అసభ్యకరంగా తిట్టి చెప్పులతో కొట్టేందుకు ప్రయత్నించారని రోహిణి తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ వ్యవహారంపై రోహిణి మరో సోదరుడు తేజ్ ప్రతాప్ యాదవ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. తన సోదరికి జరిగిన అవమానాన్ని భరించలేకపోతున్నట్టు పేర్కొన్నారు. కొందరు వ్యక్తులు తేజస్వీని తప్పుదారి పట్టిస్తున్నారని ఆయన ఆరోపించాడు. తండ్రి లాలూ ప్రసాద్ ఒక్క అవకాశం ఇచ్చినా ఈ 'జైచంద్‌లకు' బిహార్ ప్రజలు సమాధి కట్టేస్తారని అన్నారు.

ఇది పార్టీ విషయం కాదని, కుటుంబం, కుమార్తె గౌరవం, రాష్ట్ర ప్రతిష్ట విషయమని తేజ్ ప్రతాప్ హెచ్చరించాడు. తేజ్ ప్రతాప్‌ను ఆర్జేడీ నుంచి, కుటుంబం నుంచి బహిష్కరించడంపై రోహిణి అసంతృప్తి చెందినట్లు తెలుస్తోంది. పార్టీ నుంచి వెళ్లిన తేజ్ ప్రతాప్ జనశక్తి జనతాదళ్ పేరుతో కొత్త పార్టీ స్థాపించి ఇటీవల బిహార్ ఎన్నికల్లో మహువా స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయాడు.

Next Story