- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇండిగో విమానంలో సాంకేతిక సమస్యలు.. చెన్నై నుంచి మధురై వెళ్తుండగా..!
ఇటీవల కాలంలో విమానాల్లో సాంకేతిక లోపాలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల కాలంలో విమానాల్లో (Flights) సాంకేతిక లోపాలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. ఒకవైపు ఆధునిక సాంకేతికతతో విమాన ప్రయాణం వేగవంతం, సౌకర్యవంతం అవుతున్నప్పటికీ.. మరోవైపు సాంకేతిక లోపాలు పెరిగిపోవడం ప్రయాణికుల్లో భయాన్ని రేకెత్తిస్తోంది. ఎప్పుడెప్పుడు ఏ విమానంలో ఏమి జరుగుతుందో అన్న అనిశ్చితి ప్రయాణాన్ని భయానక అనుభవంగా మార్చుతోంది. తాజాగా మరో ఘటన వెలుగులోకి రావడంతో మళ్లీ విమాన భద్రతపై చర్చ మొదలైంది. ఉదయం 7:55 గంటలకు చెన్నై (Chennai) నుంచి మధురైకు (Madurai) బయలుదేరిన ఇండిగో (Indigo) ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. టేకాఫ్ అయిన అరగంటకే ఈ లోపాన్ని గుర్తించిన పైలట్ అప్రమత్తంగా స్పందించి, వెంటనే విమానాన్ని తిరిగి చెన్నైకి మళ్లించాడు. విమానం అక్కడ సురక్షితంగా ల్యాండ్ అయింది.
ఈ ఘటన సమయంలో విమానంలో 60 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ప్రయాణీకులందరూ సురక్షితంగా ఉన్నారు. అధికారులు వెంటనే మరో విమానాన్ని ఏర్పాటు చేసి ప్రయాణికులను మధురైకు తరలించారు. ఈ ఘటనపై ఇండిగో స్పందిస్తూ, ప్రయాణికుల భద్రతే తమకు ప్రాధాన్యత అని తెలిపింది. కాగా ఇటీవల అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఆ ఘటన తర్వాత విమాన భద్రత విషయంలో ఎయిర్‌లైన్స్ ఎలాంటి రాజీ లేకుండా నిర్ణయాలు తీసుకుంటున్నాయి.






