- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇండిగో విమానంలో సాంకేతిక లోపం.. వెనక్కి మళ్లించిన పైలట్లు
ఇటీవల కాలంలో తరచూ విమానాలు రద్దవ్వడం, టేకాఫ్ అనంతరం సాంకేతిక లోపాలు తలెత్తడం వంటి ఘటనలు తీవ్ర ఆందోళనలకు కారణమవుతున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల కాలంలో తరచూ విమానాలు రద్దవ్వడం, టేకాఫ్ అనంతరం సాంకేతిక లోపాలు తలెత్తడం వంటి ఘటనలు తీవ్ర ఆందోళనలకు కారణమవుతున్నాయి. ముఖ్యంగా ఇండిగో, స్పైస్‌జెట్, ఎయిర్ ఇండియా వంటి ప్రముఖ విమానయాన సంస్థల ఫ్లైట్లలో సాంకేతిక లోపాలు నమోదవుతుండటంతో ప్రయాణికులు భయభ్రాంతులకు లోనవుతున్నారు. తాజాగా ఇండిగో (Indigo) విమానంలో సమస్య తలెత్తటంతో పైలట్ అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సిన పరిస్థితి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే..
మధ్యప్రదేశ్ (Madhyapradesh) రాష్ట్రంలోని ఇండోర్ (Indore) దేవీ అహల్యాబాయ్ హోల్కర్ (Devi Ahilyabai Holkar) విమానాశ్రయం నుంచి మంగళవారం ఉదయం 6.30కి రాయ్‌పూర్ (Raipur)కు ఇండిగో విమానం బయలుదేరింది. అయితే, టేకాఫ్ అయిన కాసేపటికే 6.54 విమానం తిరిగొచ్చి ల్యాండయ్యింది. విమానంలో సాంకేతిక లోపానికి సంకేతంగా అలారమ్ మోగింది. అప్పటికే విమానం సగానికిపైగా ప్రయాణం పూర్తి చేసుకుంది. అయినా పైలట్ ప్రయాణికుల సేఫ్టీ కోసం విమానాన్ని వెనక్కి మళ్లించాడు. తిరిగి ఇండోర్ విమానాశ్రయంలో సేఫ్‌గా ల్యాండ్ చేశాడు. అనంతరం ఇండిగో యాజమాన్యం ఫ్లైట్‌ను రద్దుచేసింది. ప్రయాణికుల టికెట్ ఛార్జీలను రీఫండ్ చేసింది. అయితే, విమానాన్ని ఇంజినీర్‌లు తనిఖీ చేయగా ఏ లోపం లేదని, టెక్నికల్ ఇష్యూవల్ల ఫాల్స్ అలారమ్ మోగినట్లు నిర్ధారించారు.






