- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెళ్లి చేసుకున్న టీ20 వరల్డ్ కప్ హీరో
భారత క్రికెటర్ కుల్దీప్ యాదవ్ తన జీవితంలో సరికొత్త ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు.

దిశ, వెబ్‌డెస్క్: భారత క్రికెటర్ కుల్దీప్ యాదవ్ తన జీవితంలో సరికొత్త ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. తన చిరకాల మిత్రురాలు వంశిక చద్దాను ఆయన వివాహం చేసుకున్నారు. ఆదివారం ఉత్తరఖండ్‌లోని ముస్సోరీలోని ప్రఖ్యాత ‘సవాయ్ హోటల్’లో వీరిద్దరూ ఏడడుగులు వేసి ఒక్కటయ్యారు. పెళ్లికి ముందు నిర్వహించిన కుల్దీప్ బరాత్ (ఊరేగింపు)లో కోలాహలం నెలకొంది. డోలు సన్నాయి వాయిద్యాల మధ్య బంధుమిత్రులు స్టెప్పులు వేయగా, స్వయంగా పెళ్లికొడుకు కుల్దీప్ యాదవ్ కూడా వారితో కలిసి డ్యాన్స్ చేయడం విశేషం. ‘దూల్హే రాజా’ (పెళ్లికొడుకు) జోష్ చూసి అతిథులు కూడా కేరింతలు కొట్టారు. పెళ్లిలో కుల్దీప్ షేర్వానీలో రాజకుమారుడిలా మెరిసిపోగా, వంశిక తన ట్రెడిషనల్ లుక్‌తో అందరినీ ఆకట్టుకున్నారు.
తరలివచ్చిన క్రికెట్ స్టార్లు..
ఈ వివాహ వేడుకకు క్రికెట్ రంగానికి చెందిన ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు యుజ్వేంద్ర చాహల్, రింకూ సింగ్, సురేష్ రైనాతో పాటు బాగేశ్వర్ ధామ్ సర్కార్‌కు చెందిన ధీరేంద్ర శాస్త్రి కూడా ఈ పెళ్లికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. వివాహ వేడుక ముగిసిన వెంటనే కుల్దీప్-వంశికల మొదటి ఫోటోలు మరియు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ జంట చూడముచ్చటగా ఉందంటూ నెటిజన్లు, క్రికెట్ అభిమానులు మరియు సహచర ఆటగాళ్లు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ముస్సోరీలోని ప్రకృతి ఒడిలో సాదాసీదాగా, అదే సమయంలో ఎంతో వైభవంగా జరిగిన ఈ పెళ్లి వేడుక క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.






