Data Leak: మహిళల డేటింగ్ యాప్ 'టీ' లో చాటింగ్ లీక్

by Prasad Jukanti |

11 లక్షల మంది మహిళా యూజర్ల ప్రైవేటు సంభాషణలు, ఫోటోలు ఆన్ లైన్ లో ప్రత్యక్ష్యం అయ్యాయి.

Data Leak: మహిళల డేటింగ్ యాప్ టీ లో చాటింగ్ లీక్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రముఖ మహిళా డేటింగ్ యాప్ 'టీ' చాట్ లీక్ (Tea App Data Breach) కావడం కలకలం రేపుతున్నది. దాదాపు 11 లక్షల మంది యూజర్ల మధ్య జరిగిన ప్రైవేటు చాటింగ్ లు ఇప్పుడు ఆన్ లైన్ లో ప్రత్యక్షం అయ్యాయి. ఈ వ్యవహరం యూజర్లను కలవరపాటుకు గురిచేస్తోంది. మహిళలు మాత్రమే సభ్యత్వం పొందేలా టీ యాప్ ను రూపొందించారు. తమ యాప్ మహిళలకు సేఫ్ అని నిర్వాహాకులు చెబుతున్నారు. దీంతో చాలా మంది మహిళలు ఈ యాప్ లో చేరారు. ప్రస్తుతం ఈ యాప్ లో 16 లక్షల మంది యూజర్లు ఉండగా ఇందులో చేరే వారి సెల్ఫీలతో నిర్ధారణ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఫీచర్ ఉండటంతో చాలా మంది మహిళలు ఈ డేటింగ్ యాప్ కు ఆకర్షితులయ్యారు. ఈ క్రమంలో టీ యాప్ డేటా లీక్ అయింది. పెద్ద ఎత్తున ప్రైవేట్ సంభాషణలు ఆన్ లైన్ లో ప్రత్యక్షం అయినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువరించింది. వేలాది మంది యూజర్ల సెల్పీలు, ఐడెంటిటి ఫోటోలు ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతున్నాయి. అత్యంత వ్యక్తిగతమైన, సున్నితమైన సమాచారం ఇప్పుడు బజారున పడింది. ఈ విషయంలో ఓ సైబర్ సెక్యూరిటీ నిపుణుడు స్పందిస్తూ తాజా లీక్ లో 2023 నుంచి జరిగిన సంభాషణలు కూడా ఉన్నాయని ఇందులో కొంత మంది మహిళలు అబర్షన్స్, లీరేషన్స్ పై చర్చించుకున్న సమాచారం కూడా ఉందని తెలిపారు. ఈ యాప్ లో తమ చాటింగ్ పూర్తిగా ప్రైవేట్, సెక్యూర్ అని భావించిన వారంతా తమ వ్యక్తిగత సమాచారం బహిర్గతం కావడం వారిని ఆందోళనకు చెందుతున్నారు. ఈ యాప్ లో ఇలాంటి ప్రైవసీ ఉల్లంఘనలు గతంలోనూ వచ్చాయి. మళ్లీ రిపీట్ కావడం పట్ల ఈ యాప్ పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా ఈ హ్యాకింగ్ ను ‘టీ’ యాప్ ప్రతినిధి ఒకరు ధృవీకరించారు. డేటా లీక్ పై తగిన చర్యలు ప్రారంభించామని భద్రతా సంస్థలు జరిపే దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తున్నట్లు వెల్లడించారు.

Next Story