- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీఎం రేవంత్ రెడ్డితో టీడీపీ మహిళా నేతలు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఏపీ టీడీపీ మహిళా నేతలు కలిశారు.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఏపీ టీడీపీ మహిళా నేతలు కలిశారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్న సంగతి తెలిసిందే. అటు ఢిల్లీలోనే ఉన్న ఏపీ టీడీపీ మహిళా నేతలు, ఈ విషయం తెలుసుకొని సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇక ఈ ఫోటోలను ఏపీ మాజీ మంత్రి పరిటాల సునీత తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఇందులో తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారు.
అయితే, సీఎం రేవంత్ రెడ్డిని టీడీపీ మహిళా నేతలు కలవడం హాట్ టాపిక్ అయింది. గతంలో టీడీపీ పార్టీలో రేవంత్ రెడ్డి పని చేశారు. చంద్రబాబు నాయుడుకు నమ్మిన బంటుగా ఉండేవారు. అటు ఏపీలోని టీడీపీ నేతలతో కూడా సీఎం రేవంత్ కు పరిచయాలు ఉన్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ ఉన్నప్పటికీ, సీఎం రేవంత్ రెడ్డితో సాఫ్ట్ కార్నర్ కొనసాగిస్తున్నారు ఏపీ నేతలు. కాగా పార్లమెంట్ లో మహిళా రిజర్వేషన్ల బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఢిల్లీకి ఏపీ టీడీపీ మహిళలు వెళ్లారు.
ఈరోజు ఢిల్లీలో నా సహచర ఎమ్మెల్యేలు, టిడిపి ఎంపీలతో కలిసి తెలంగాణ ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి గారిని ఢిల్లీ లో మర్యాదపూర్వకంగా కలిసిన సందర్భంగా… pic.twitter.com/pSPZPenZ6v
— Paritala Sunitha (@SunithaTDP) April 16, 2026






