- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆఫర్ లెటర్లు ఓకే.. జాయినింగ్ లో జాప్యం.. టీసీఎస్‌పై కేంద్రానికి ఫిర్యాదుల వెల్లువ
టీసీఎస్ ఉద్యోగాల (TCS Jobs) విషయంలో కొత్త వివాదం చెలరేగింది. అనుభవజ్ఞులైన దాదాపు 600 మంది అభ్యర్థులకు టీసీఎస్ ఉద్యోగ..

దిశ, వెబ్‌డెస్క్: టీసీఎస్ ఉద్యోగాల (TCS Jobs) విషయంలో కొత్త వివాదం చెలరేగింది. అనుభవజ్ఞులైన దాదాపు 600 మంది అభ్యర్థులకు టీసీఎస్ ఉద్యోగ ఆఫర్లు ఇచ్చినా, జాయినింగ్ డేట్లను ఇప్పటివరకు ఇవ్వకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ విషయంలో నాస్‌సెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయిస్ సెనెట్ (NITES) కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయాకు ఫిర్యాదు చేసింది. టీసీఎస్ తరఫున జాబ్ ఆఫర్ ఇచ్చినప్పటికీ, జాయినింగ్‌ను నిరవధికంగా వాయిదా వేస్తూ వస్తోందని NITES లేఖలో పేర్కొంది.
జాబ్ ఆఫర్ వచ్చిన అభ్యర్థులంతా 2 నుంచి 8 ఏళ్ల అనుభవం కలవారు. బెంగళూరు, హైదరాబాద్, పుణె, కోల్‌కతా, ముంబయి, దిల్లీ ప్రాంతాలకు చెందినవారు. టీసీఎస్ ఆఫర్ లెటర్ ఇచ్చిన తర్వాత, వారు తమ పాత ఉద్యోగాలకు రాజీనామా చేశారు. కానీ కంపెనీ మొదట జాయినింగ్ డేట్‌ను వాయిదా వేసింది. ఆ తర్వాత ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నిశ్శబ్దంగా ఉంది. ఈ పరిణామాల వల్ల వారు ఆర్థిక, మానసికంగా, వృత్తిపరంగా తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని NITES లేఖలో పేర్కొంది.
ఈ నేపథ్యంలో NITES అధ్యక్షుడు హర్‌ప్రీత్ సింగ్ సలుజా మాట్లాడుతూ, టీసీఎస్ నిర్లక్ష్యంతో అభ్యర్థులు తీవ్ర మానసిక వేదనను ఎదుర్కొంటున్నారని తెలిపారు. దీనిపై తక్షణమే కేంద్రం జోక్యం చేసుకోవాలని, జాప్యానికి బాధ్యత వహిస్తూ కంపెనీ నుంచి ఆర్థికపరిహారం కల్పించాలని, టీసీఎస్ ఎంప్లాయిస్ అసిస్టెంట్ ప్రోగ్రామ్ ద్వారా వారికి అవసరమైన మద్దతు ఇవ్వాలని కోరారు.
ఇక ఈ అంశంపై టీసీఎస్ స్పందిస్తూ, తాము ఇచ్చిన అన్ని ఆఫర్లను నిలబెట్టుకుంటామని స్పష్టం చేసింది. ఫ్రెషర్స్ అయినా, అనుభవజ్ఞులైనా ఆఫర్ లెటర్ అందుకున్న ప్రతీ వ్యక్తి కంపెనీలో చేరుతారని తెలిపింది. అయితే వ్యాపార అవసరాల ఆధారంగా జాయినింగ్ డేట్లు మారవచ్చని స్పష్టం చేసింది. ఈ అభ్యర్థులతో తమ సంప్రదింపులు కొనసాగుతున్నాయని వివరించింది.






