- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మందుబాబులకు గుడ్ న్యూస్.. ఖాళీ బాటిల్ ఇస్తే డబ్బులు
మందుబాబులకు రాష్ట్ర మార్కెటింగ్ కార్పొరేషన్ గుడ్ న్యూస్ చెప్పింది. ఖాళీ బాటిళ్లిస్తే.. డబ్బులిస్తామని తెలిపింది. అయితే ఈ పథకం తెలుగు రాష్ట్రాల్లో కాదు.

దిశ, వెబ్‌డెస్క్: మందుబాబులకు రాష్ట్ర మార్కెటింగ్ కార్పొరేషన్ గుడ్ న్యూస్ చెప్పింది. ఖాళీ బాటిళ్లిస్తే.. డబ్బులిస్తామని తెలిపింది. అయితే ఈ పథకం తెలుగు రాష్ట్రాల్లో కాదు. తమిళనాడులోని చెన్నైలో మళ్లీ ప్రారంభం కాబోతోంది. గతంలో ఈ బైబ్యాక్ పథకం.. ఉద్యోగుల వ్యతిరేకత నిరసనల కారణంగా ఆగిపోగా.. ఈసారి పకడ్బందీ ఏర్పాట్లతో తిరిగి ప్రారంభించనుంది. మద్యం బాటిల్ ను కొనుగోలు చేసేటపుడే కస్టమర్ల నుంచి అదనంగా రూ.10 వసూలు చేస్తారు. ఆ బాటిల్ ఖాళీ అయ్యాక దానిని టాస్మాక్ షాపు లేదా కలెక్షన్ పాయింట్లో అప్పగిస్తే రూ.10 వాపస్ ఇస్తారు. పర్యావరణను పరిరక్షించేందుకే రాష్ట్ర మార్కెటింగ్ కార్పొరేషన్ ఈ పథకాన్ని తీసుకొచ్చింది. కానీ.. ఖాళీ బాటిళ్లను నిల్వ చేసేందుకు, సేకరించేందుకు సరైన సౌకర్యాలు లేకపోవడంతో టాస్మాక్ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. పైగా పనిభారం కూడా పెరుగుతుందంటూ దుకాణాలు మూసివేసి ఆందోళన చేయడంతో పథకం నిలిచిపోయింది. ఈ వారం నుంచి తిరిగి ఈ పథకం ప్రారంభం కానుంది.






