- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > దేశం-విదేశం > Tarrifs: అమెరికాకు భారత్ షాక్.. యూఎస్ వస్తువులపై ప్రతీకార సుంకాలు విధించే చాన్స్ !
Tarrifs: అమెరికాకు భారత్ షాక్.. యూఎస్ వస్తువులపై ప్రతీకార సుంకాలు విధించే చాన్స్ !
by B.Srinivas |
అమెరికాకు భారత్ భారీ షాక్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. యూఎస్ నుంచి దిగుమతి చేసుకునే పలు వస్తువులపై ప్రతీకార సుంకాలు విధించేందుకు సిద్దమైంది.

X
దిశ, నేషనల్ బ్యూరో: అమెరికాకు భారత్ భారీ షాక్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. యూఎస్ నుంచి దిగుమతి చేసుకునే పలు వస్తువులపై ప్రతీకార సుంకాలు (Revenge Tarrifs) విధించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తన డిసిషన్‌ను వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (WTO)కు తెలియజేసినట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. అయితే ఏరకమైన వస్తువులపై సుంకాలు విధిస్తారో అనే విషయాన్ని వెల్లడించలేదు. మార్చిలో భారత ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై అమెరికా 26 శాతం సుంకాలు విధించింది. దీని వల్ల 7.6 బిలియన్ డాలర్ల విలువైన భారతీయ ఎగుమతులపై ప్రభావం పడింది. దీనికి బదులుగానే ఇండియా తాజా డిసిషన్ తీసుకుంది. కాగా, భారత్ అమెరికాల మధ్య కొత్త ట్రేడ్ డీల్ ఉంటుందని కథనాలు వెలువడుతున్న నేపథ్యంలోనే ఇండియా ప్రతీకార సుంకాలపై నిర్ణయం తీసుకోవడం హాట్ టాపిక్‌గా మారింది.
Next Story






