- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ట్రంప్‌ది టారిఫ్ టెర్రరిజం
ఏప్రిల్ 2 నుంచి పరస్పర సుంకాలను విధించాలని ట్రంప్ భావిస్తున్నారు. ఇండియాపై కూడా సుంకాలు విధిస్తామని ట్రంప్ ఇప్పటికే స్పష్టం చేశారు.

- మేధో వలస రాజ్యాలను స్థాపనకు ట్రంప్ ప్రయత్నం
- భారత్ అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది
- యోగా గురు బాబా రాందేవ్
దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 'టారిఫ్ టెర్రరిజం'ను ప్రోత్సహిస్తున్నారు. పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలను బెదిరించడం ద్వారా మేధో వలస రాజ్యాలను స్థాపించాలని ట్రంప్ ప్రయత్నిస్తున్నారని ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్ ఆరోపించారు. డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్న ప్రతీకార సుంకాలపై పతంజలి సహ వ్యవస్థాపకుడు బాబా రాందేవ్, ఎండీ ఆచార్య బాలకృష్ణ ఆదివారం స్పందించారు. ఇప్పుడు మేధో వలస రాజ్యాల కొత్త యుగం మొదలైంది. డొనాల్డ్ ట్రంప్ రెండో సారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి టారిఫ్ టెర్రరిజంలో ప్రపంచ రికార్డు సృష్టించాడని రాందేవ్ అన్నారు. పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలను బెదిరిండచం ద్వారా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశాడని రాందేవ్ అన్నారు. ఆర్థిక ఉగ్రవాదంతో ట్రంప్ ప్రపంచాన్ని వేరే యుగంలోకి తీసుకెళ్తున్నాడని ఆరోపించారు. ఇలాంటి విధ్వంసకర శక్తులన్నింటికీ సమాధానం చెప్పడానికి, ఇండియాను బలమైన దేశంగా నిర్మించడానికి భారతీయులందరూ ఐక్యంగా ఉండాలని రాందేవ్ కోరారు.
శక్తివంతమైన దేశాలు ప్రపంచాన్ని విధ్వంసం వైపు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాయి. ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల మధ్య భారత్ అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.కాగా, ట్రంప్ అధికారం చేపట్టినప్పటి నుంచి అమెరికాకు అతిపెద్ద వాణిజ్య భాగస్వామ్యులైన మెక్సికో, కెనడా, చైనాల నుంచి దిగుమతయ్యే వస్తువలపై భారీ సుంకాలను విధించారు. అయితే వీటిపై చర్చల అనంతరం వాహన తయారీదారులకు ఒక నెల మినహాయింపు ఇచ్చారు. ఏప్రిల్ 2 నుంచి పరస్పర సుంకాలను విధించాలని ట్రంప్ భావిస్తున్నారు. ఇండియాపై కూడా సుంకాలు విధిస్తామని ట్రంప్ ఇప్పటికే స్పష్టం చేశారు.






